Minister Chelluboina : పవన్ స్పెషల్ ప్యాకేజీ కోసం పొత్తులు పెట్టుకుంటాడు

ABN , First Publish Date - 2023-05-13T11:47:12+05:30 IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ ఒక అపరిపక్వ నాయకుడుగా మిగులుతాడన్నారు.

Minister Chelluboina : పవన్ స్పెషల్ ప్యాకేజీ కోసం పొత్తులు పెట్టుకుంటాడు

విజయవాడ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ ఒక అపరిపక్వ నాయకుడుగా మిగులుతాడన్నారు. పవన్ స్పెషల్ ప్యాకేజీ కోసం పొత్తులు పెట్టుకుంటాడని విమర్శించారు. ఎవరి అజెండాను పవన్ అమలు పరచాలనుకుంటున్నాడని ప్రశ్నించారు. జనసైనికుల ఆశల మీద పవన్ నీళ్ళు చల్లాడన్నారు. పవన్‌ను నమ్మిన వాళ్ళని దగా చేశాడని చెల్లుబోయిన విమర్శించారు. పవన్ చేసిన పనితో 2014-19 లో ప్రజలు నష్టపోయారని పవన్ ఆత్మసాక్షికి తెలియాలన్నారు. 2014-19 లో జరిగిన తప్పుల్లో పవన్ వాటాదారుడు కావాలన్నారు. రైతుల దగ్గరకు వెళ్ళి కొంగజపం చేస్తున్నారన్నారు. ప్రకృతి వలన వచ్చిన కష్టాలను వికృతంగా చూపించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. పవన్ స్వతంత్రంగా గెలవలేడని.. ఏ లక్ష్యాలతో పవన్‌కు జనసైనికులు మద్దతిచ్చారో అది చేయలేనని పరోక్షంగా చెప్పాడని మంత్రి చెల్లుబోయిన పేర్కొన్నారు.

Updated Date - 2023-05-13T11:47:12+05:30 IST