Minister Viswarup: సీఎం జగన్ దళిత మంత్రిని అవమానించారన్న వార్తలపై మంత్రి విశ్వరూప్ స్పందన

ABN , First Publish Date - 2023-08-12T17:24:36+05:30 IST

అమలాపురంలో వైసీపీ మంత్రి విశ్వరూప్ (YCP Minister Viswarup) మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనపై మీడియాలో ప్రసారమవుతోన్న వార్తలను ఖండించారు.

Minister Viswarup: సీఎం జగన్ దళిత మంత్రిని అవమానించారన్న వార్తలపై మంత్రి విశ్వరూప్ స్పందన

అంబేద్కర్ కోనసీమ జిల్లా: అమలాపురంలో వైసీపీ మంత్రి విశ్వరూప్ (YCP Minister Viswarup) మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనపై మీడియాలో ప్రసారమవుతోన్న వార్తలను ఖండించారు. సీఎం జగన్ తనను అవమానించారని మీడియాలో ప్రసారమైన వార్తలపై ఆయన మండిపడ్డారు.


"నా గౌరవానికి భంగం కలిగిన పక్షంలో రాజకీయాల నుంచి తప్పుకుంటా. డ్వాక్రా మహిళలు ఫోటో తీసుకుంటుండగా నేను అనుకోకుండా కూర్చున్నాను. ముఖ్యమంత్రి పిలవడంతో ఆ ఫోటో వద్దకు వెళ్ళాను. జగన్ దళిత మంత్రిని అవమానించినట్లు మీడియా ప్రచారం చేసింది. మంత్రికి అవమానం అంటూ మీడియా చేసిన ప్రచారాన్ని ఖండిస్తున్నా." అని మంత్రి విశ్వరూప్ చెప్పారు.

Updated Date - 2023-08-12T17:32:22+05:30 IST