Pawan Kalyan : మరోసారి వలంటీర్ వ్యవస్థపై పవన్ సంచలనం.. ప్రశ్నల వర్షం కురిపించిన జనసేనాని..

ABN , First Publish Date - 2023-07-21T13:14:53+05:30 IST

పౌరుల డేటా సేకరణపై వైసీపీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. నేడు ఆయన ట్విటర్ వేదికగా ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘వలంటీర్ల బాస్ ఎవరు? ప్రైవేట్ డేటాను సేకరించడానికి వారికి ఎవరు సూచనలు ఇస్తారు? ఇది ప్రైవేట్ కంపెనీ అయితే, దానికి అధిపతి ఎవరు? అది AP ప్రభుత్వమైతే డేటా సేకరించమని ఎవరు ఆదేశించారు? అది చీఫ్ సెక్రటరీనా? సీఎం? కలెక్టరా? ఎమ్మెల్యే? ఎవరు?’’ అంటూ ప్రధాని, కేంద్ర హోం మంత్రికి విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేశారు.

Pawan Kalyan : మరోసారి వలంటీర్ వ్యవస్థపై పవన్ సంచలనం.. ప్రశ్నల వర్షం కురిపించిన జనసేనాని..

అమరావతి : పౌరుల డేటా సేకరణపై వైసీపీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. నేడు ఆయన ట్విటర్ వేదికగా వలంటీర్ వ్యవస్థపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘వలంటీర్ల బాస్ ఎవరు? ప్రైవేట్ డేటాను సేకరించడానికి వారికి ఎవరు సూచనలు ఇస్తారు? ఇది ప్రైవేట్ కంపెనీ అయితే, దానికి అధిపతి ఎవరు? అది AP ప్రభుత్వమైతే డేటా సేకరించమని ఎవరు ఆదేశించారు? అది చీఫ్ సెక్రటరీనా? సీఎం? కలెక్టరా? ఎమ్మెల్యే? ఎవరు?’’ అంటూ ప్రధాని, కేంద్ర హోం మంత్రిని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.

ఇంతకు ముందు పవన్ వలంటీర్ వ్యవస్థపై మాట్లాడుతూ.. ‘వలంటీర్ వ్యవస్థ చాలా భయంకరమైన వ్యవస్థ. వలంటీర్లకు 5 వేలు ఇచ్చి ఇంట్లో దూరే అవకాశమిచ్చారు. ప్రతి ఇంటి డేటా అంతా వలంటీర్లకి తెలుసు. ఎవరు ఎక్కడికి వెళ్తున్నారో అంతా వాళ్లకి తెలుస్తుంది. ప్రభుత్వ ఉద్దేశం మరోలా ఉండవచ్చు.. సెన్సిటీవ్‌ ఇన్ఫర్మేషన్‌ బయటకు వెళ్తే ఎలా?. వలంటీర్ల వ్యవస్థ పట్ల అంతా అప్రమత్తంగా ఉండాలి. దానికి మనం వ్యతిరేకం కాదు.. కానీ ప్రభుత్వానికి మద్ధతుగా పనిచేస్తే అంగీకరించవద్దు.. ఏమీ భయపడొద్దు. రేషన్ డిపోల వ్యవస్థకు సమాంతరంగా మొబైల్ డిపోల వ్యవస్థ తీసుకువచ్చారు. ఎప్పుడైనా సీఎం వైఎస్ జగన్ (CM YS Jagan) ఈ వ్యవస్థను పరిశీలించారా..?. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు జాగ్రతగా ఉండాలి. మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా..? లేదా..? చూసుకోవాలి.

ఒంటరి, వితంతు, భర్తలతో విడిపోయి ఉంటున్న మహిళలు జాగ్రతగా..? ఉన్నారా.. లేదా..? అనేది గ్రామాల్లో ఉండే జనసేన వీర మహిళలు ఒక కంటితో గమనించాలి. దెందులూరు నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమం మనం ప్రారంభిద్దాం. ప్రతీ రాజకీయ మద్ధతుదారుడు మహిళల భద్రతపై దృష్టిపెట్టాలి. వలంటీర్లు వైసీపీకి పనిచేస్తున్నారో లేదో దృష్టిపెట్టాలి. వలంటీర్లకు అవసరమైన సమాచారం మాత్రమే ఇవ్వండి.. అనవసరంగా సమాచారం ఇవ్వవద్దు. సమాంతర రాజకీయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ ఉండడానికే జగన్ ఈ వ్యవస్థను డిజైన్ చేశారు. ఇదంతా ప్రజలను నియంత్రించడానికే.. వలంటీర్ల వ్యవస్థను సరిగ్గా చూడకపోతే, భవిష్యత్తులో అది ఒక ఐఏఎస్ వ్యవస్థలా అవుతుంది. పులివెందుల ఒకప్పుడు సరస్వతి నిలయం. అటువంటి దానిని ఫ్యాక్షన్ నిలయంగా మార్చారు. ఫ్యాక్షన్ సంస్కృతిని మార్చి పులివెందులను మళ్లీ సరస్వతి నిలయంగా మార్చుదాం’ అని చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-07-21T13:14:53+05:30 IST