Share News

LIC Specials Plan: రోజుకు రూ.72 కట్టండి.. నెలకు రూ.28 వేలు పట్టేయండి.. ఎలా అంటే..?

ABN , First Publish Date - 2023-11-28T11:46:45+05:30 IST

ఈ రోజుల్లో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చాలా మంది పిల్లలు సరిగ్గా పట్టించుకోవడం లేదు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు సేవ చేయడానికి చాలా మంది పిల్లలు ముందుకు రావడం లేదు. దీంతో వృద్ధాప్యంలో ఉన్నవారికి తమ పోషణ కష్టమవుతుంది. వృద్ధాప్యంలో ఉన్నవారు పని చేయలేరు. కాబట్టి వారు తమ పోషణ కోసం ఇతరులపై ఆధారపడాల్సి ఉంటుంది.

LIC Specials Plan: రోజుకు రూ.72 కట్టండి.. నెలకు రూ.28 వేలు పట్టేయండి.. ఎలా అంటే..?

ఈ రోజుల్లో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చాలా మంది పిల్లలు సరిగ్గా పట్టించుకోవడం లేదు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు సేవ చేయడానికి చాలా మంది పిల్లలు ముందుకు రావడం లేదు. దీంతో వృద్ధాప్యంలో ఉన్నవారికి తమ పోషణ కష్టమవుతుంది. వృద్ధాప్యంలో ఉన్నవారు పని చేయలేరు. కాబట్టి వారు తమ పోషణ కోసం ఇతరులపై ఆధారపడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో డబ్బుల కోసం, చిన్న చిన్న అవసరాల కోసం పిల్లలను లేదా ఇతరులను అడుక్కోవలసి ఉంటుంది. ఇలాంటి వారి కోసమే ప్రస్తుత రోజుల్లో అనేక భీమా పథకాలు అందుబాటులోకి వచ్చాయి. ఇందుకు వాళ్లు చేయాల్సిందిల్లా యవ్వనంలో ఉన్న సమయంలోనే వారు కొంత డబ్బును పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఇలాంటి పథకమే ఒకటి ప్రస్తుతం ప్రముఖ బీమా సంస్థ ఎల్‌ఐసీ తీసుకొచ్చింది. ఆ పథకం పేరు ఎల్‌ఐసీ జీవన్ నిధి ప్లాన్. ఈ పథకంలో రోజుకు రూ.72 కడితే చాలు రిటైర్ అయ్యాక నెలకు రూ.28 వేల ఫించన్ పొందొచ్చు. ఈ పథకానికి 20 సంవత్సరాల నుంచి 58 సంవత్సరాల మధ్య వయసున్న పతి ఒక్కరు అర్హలే. ఈ వయసులో ఉద్యోగులు పెట్టుబడి పెడితే 55 నుంచి 65 సంవత్సరాల మధ్య వయసులో నెలకు రూ.28 వేలు ఫించన్ పొందొచ్చు.


ఈ ప్లాన్‌లో భాగంగా డబ్బులు చెల్లించేందుకు సింగిల్, రెగ్యూలర్ ప్రీమియం అందుబాటులో ఉంది. 5 సంవత్సరాల పెట్టుబడి కోసం ఈ పాలసీలో గ్యారెంటీడ్ అదనంగా అందుబాటులో ఉంటుంది. 5 సంవత్సరాలు ప్రీమియం కట్టిన తర్వాత ఆరో సంవత్సరం నుంచి బోనస్ కూడా వర్తిస్తుంది. ప్రమాదవశాత్తూ సంభవించే మరణాలు, డిసేబిలిటీ రైడర్ సౌకర్యం కూడా ఈ ప్లాన్‌లో ఉంది. అయితే ఫించన్ మొత్తంగా పన్ను కూడా ఉంటుంది. కానీ చెల్లించిన ప్రీమియం, 1/3 మెచ్యూరిటీ మొత్తానికి కూడా ఆదాయపు పన్ను చట్టం సెక్షన్లు 80సీ, 10 (10ఏ) కింద పన్ను మినహాయింపు ఉంది. ఈ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే వారు రక రకాలుగా ప్రీమియం చెల్లించవచ్చు. వార్షిక, నెలవారీ, అర్ధ వార్షిక, త్రైమాసిక మోడ్‌లలో ప్రీమియం చెల్లించవచ్చు. వార్షిక ప్రీమియం రూ.26,503, అర్ధ వార్షిక ప్రీమియం రూ.13,393, త్రైమాసిక ప్రీమియం రూ.6,766, నెలవారీ ప్రీమియం రూ.2,255గా ఉంది. దీని ప్రకారం పాలసీదారు ప్రతి రోజూ దాదాపు రూ.72 ఆదా చేయాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత పాలసీదారులకు నెలకు దాదాపు రూ.28 వేలు పెన్షన్ వస్తుంది.

Updated Date - 2023-11-28T11:46:47+05:30 IST