Credit Card payments: క్రెడిట్ కార్డ్ యూజర్లు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలివీ..

ABN , First Publish Date - 2023-03-28T20:51:26+05:30 IST

ఆలస్యంగా బిల్లులు చెల్లించడం (Bill payments) మంచి అలవాటు కాదు. కానీ అనివార్య పరిస్థితుల్లో కొన్నిసార్లు లేటుగా పేమెంట్ చేయాల్సి రావొచ్చు. అందుకే క్రెడిట్‌కార్డ్ యూజర్లు అందరూ ఈ విషయాలు తెలుసుకోవడం మంచిది

Credit Card payments: క్రెడిట్ కార్డ్ యూజర్లు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలివీ..

ఆలస్యంగా బిల్లులు చెల్లించడం (Bill payments) మంచి అలవాటు కాదు. కానీ అనివార్య పరిస్థితుల్లో కొన్నిసార్లు లేటుగా పేమెంట్ చేయాల్సి రావొచ్చు. అయితే ఈ విధంగా లేటు పేమెంట్‌ కారణంగా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ఆటోమేటిక్ పేమెంట్‌‌తో క్రెడిట్ కార్డు బిల్లులను సకాలంలో చెల్లించడం అత్యుత్తమం. సమయానుగుణంగా బిల్లులు చెల్లింపుతో రెండు ప్రయోజనాలు ఉన్నాయి. క్రెడిట్ కార్డు కంపెనీలు రుణ పరిమితిని పెంచుతాయి, మరోవైపు క్రెడిట్ స్కోర్ క్రమంగా మెరుగవువుతుంది.

క్రెడిట్ కార్డ్ పేమెంట్లను ఎందుకు ఆలస్యం చేయకూడదో ఈ కారణాలు...

లేటు ఫీజు: ఆలస్య ఫీజులను తప్పించుకునేందుకు క్రెడిట్ కార్డు బిల్లులను సకాలంలో చెల్లించడం ఉత్తమమార్గం. ఒకవేళ రెగ్యులర్‌గా ఆలస్యంగా చెల్లిస్తుంటే ఫీజుల భారం మరింత పెరిగిపోతుంది.

క్రెడిట్ స్కోర్: క్రెడిట్ కార్డు పేమెంట్లను వాయిదా వేస్తూ పోతే క్రెడిట్ స్కోరు దెబ్బతింటుంది. అంతేకాకుండా లేటు పేమెంట్స్ క్రెడిట్ కార్డు రిపోర్టులో ఏడేళ్ల వరకు ఉంటాయి. దీంతో క్రెడిట్ స్కోరుపై ప్రభావం పడి భవిష్యత్‌లో రుణ సేకరణ కష్టతరమవుతుంది.

అధిక వడ్డీ రేట్లు: క్రెడిట్ కార్డు పేమెంట్లు ఆలస్యమైనప్పుడు కంపెనీలు వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉంది. ఫలితంగా చెల్లింపు సమయంతోపాటు చెల్లించాల్సిన మొత్తం కూడా పెరుగుతుంది.

కలెక్షన్ కాల్స్: ఒకవేళ పేమెంట్లు రెగ్యులర్‌గా ఆలస్యంగా చెల్లిస్తుంటే సదరు క్రెడిట్‌కార్డ్ కంపెనీ కాల్స్ చేయడం మొదలుపెడతారు. ఈ పరిణామం కస్టమర్లపై చాలా ఒత్తిడి పెంచుతుంది. మానసిక ఆరోగ్యాన్ని ప్రతికూలంగా దెబ్బతీస్తుంది.

సేవ్ మనీ: సకాలంలో క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లిస్తే దీర్ఘకాలంలో డబ్బును సేవ్ చెయ్యొచ్చు. లేటు ఫీజులు, అధిక వడ్డీ రేటు భారాన్ని తప్పించుకున్నట్టే అవుతుంది. లేదంటే డబ్బు కష్టాలు తప్పవు.

Untitled-11.jpg

క్రెడిట్ హిస్టరీ: భవిష్యత్‌లో రుణ ఆమోదం కోసం క్రెడిట్ హిస్టరీ చాలాముఖ్యం. అయితే సకాలంలో బిల్లులు చెల్లిస్తే క్రెడిట్ కార్డ్ హిస్టరీ సానుకూలంగా ఉంటుంది. రుణం కోసం ఆమోదం అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.

చట్టపరమైన చర్యలు: క్రెడిట్ కార్డ్ కస్టమర్లు రెగ్యులర్‌గా లేటుగా చెల్లిస్తుంటే.. సదరు కంపెనీ తాను ఇచ్చిన రుణం కోసం చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలుంటాయి. ఈ పరిణామం భవిష్యత్ ఆర్థిక వ్యవహారాలను దెబ్బతీసే అవకాశం ఉంటుంది.

రిలేషన్‌షిప్స్: క్రెడిట్‌కార్డు పేమెంట్లు వాయిదాపడుతూ ఉంటే వ్యక్తిగతంగా ఒత్తిడి పెరుగుతుంది. అంతేకాదు వ్యక్తిగత బంధాలపై ప్రభావం పడుతుంది. కాబట్టి సకాలంలో బిల్లులు చెల్లిస్తే ఇలాంటి అనవసర ఒత్తిడులేవీ ఉండవు. అంతేకాకుండా ఇష్టమైన వ్యక్తులతో బంధాలు సవ్యంగా నడుస్తాయి.

ఫైనాన్షియల్ హెల్త్: సమయానుగుణంగా క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించడం ఆర్థిక స్థితికి చక్కటి సంకేతం. క్రమం తప్పకుండా చెల్లించడం ద్వారా ఫైనాన్సియల్ స్థితి మెరుగవుతుంది.

మానసిక ప్రశాంతత: సకాలంలో క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లిస్తే మనసుకు ప్రశాంతత లభిస్తుంది. జీవితంలో ఒత్తిడి తగ్గుతుంది. ఫలితంగా ఆర్థిక భద్రతతోపాటు స్థిరత్వం లభిస్తుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

Updated Date - 2023-03-28T21:09:47+05:30 IST