Toyota Hyryder: టొయోటా నుంచి అదిరిపోయే మరో కొత్త కారు.. ధర ఎంతో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-01-30T19:42:00+05:30 IST

టొయోటా కిర్లోస్కర్ మోటార్ (Toyota Kirloskar Motor) నుంచి మరో కొత్త కారు మార్కెట్లోకి విడుదలైంది. ఎస్‌యూవీలో సీఎన్‌జీ(CNG) వేరియెంట్లు అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ను (Urban Cruiser Hyryder) సోమవారం ఆవిష్కరించింది.

Toyota Hyryder: టొయోటా నుంచి అదిరిపోయే మరో కొత్త కారు.. ధర ఎంతో తెలిస్తే..

న్యూఢిల్లీ: టొయోటా కిర్లోస్కర్ మోటార్ (Toyota Kirloskar Motor) నుంచి మరో కొత్త కారు మార్కెట్లోకి విడుదలైంది. ఎస్‌యూవీలో సీఎన్‌జీ(CNG) వేరియెంట్లు అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ను (Urban Cruiser Hyryder) సోమవారం ఆవిష్కరించింది. రెండు వేరియెంట్లు హైరైడర్- ఎస్(S), జీ(G)లను కంపెనీ లాంచ్ చేసింది. కాగా అర్బన్ అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ -ఎస్ ధర రూ.13.23 లక్షలు, అర్బన్ అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌-జీ రూ.15.29 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంది. కాగా సరికొత్త సీఎన్‌జీ వెర్షన్ అర్బన్ క్రూయిజర్ హైరైడర్ 1.1.5 లీటర్ల కే-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌ 26.6 కి.మీ/కేజీ సామర్థ్యంతో వచ్చింది. 5-స్పీడ్ మాన్యూవల్ ట్రాన్స్‌మిషన్ జంట ఇంజన్లతో కారును రూపొందించారు.

అర్బన్ క్రూయిజర్ హైరైడర్ కారు విడుదల కంపెనీకి ప్రత్యేకమైన మైలురాయి అని కంపెనీ సేల్స్ అండ్ స్ట్రాటజిక్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ సూద్ అన్నారు. పర్యావరణ పరిరక్షణ పరిష్కారాలను చూపించేందుకు కట్టుబడి ఉన్నామని అన్నారు. తమ కంపెనీ పట్ల ఔత్సాహిక కస్టమర్ల కోసం సీఎన్‌జీ వేరియెంట్ల ధరలు ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్నారు.

Updated Date - 2023-01-30T19:42:07+05:30 IST