Crime: ఇంత కామం ఏంట్రా.. బ్లేడ్‌తో పెదవులు కోసి మరి 85 ఏళ్ల వృద్ధురాలిని ఏం చేశాడో చూడండి!

ABN , First Publish Date - 2023-09-03T21:58:13+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. కామోన్మాదంతో ఓ వ్యక్తి 85 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా వృద్ధురాలిని కొట్టి, బ్లేడ్‌తో ఆమె పెదవులు కోసి దారుణంగా హింసించాడు.

Crime: ఇంత కామం ఏంట్రా.. బ్లేడ్‌తో పెదవులు కోసి మరి 85 ఏళ్ల వృద్ధురాలిని ఏం చేశాడో చూడండి!

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. కామోన్మాదంతో ఓ వ్యక్తి 85 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా వృద్ధురాలిని కొట్టి, బ్లేడ్‌తో ఆమె పెదవులు కోసి దారుణంగా హింసించాడు. 85 ఏళ్ల వృద్ధురాలు ఢిల్లీలోని నేతాజీ సుభాష్ ప్రాంతంలో నివసిస్తుంది. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఓ వ్యక్తి ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. నిద్రిస్తున్న వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా వృద్ధురాలిని దారుణంగా కొట్టాడు. బ్లేడ్‌తో పెదవులను కోశాడు. దీంతో వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. ముఖ్యంగా ఆమె ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు 28 ఏళ్ల ఆకాష్‌‌గా గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్‌ (డీసీడబ్ల్యూ) చీఫ్‌ స్వాతి మలివాల్ కూడా స్పందించారు. కేసుకు సంబంధించిన వివరాలతో పాటు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) కాపీని అందించాలని ఢిల్లీ పోలీసులను కోరారు.

Updated Date - 2023-09-03T21:58:13+05:30 IST