Bendapudi American English: బెండపూడి ‘బడాయేనా’.. నిగ్గుతేల్చిన రిటైర్డ్‌ ఐఏఎస్‌!

ABN , First Publish Date - 2023-02-24T11:52:58+05:30 IST

ఏడెనిమిది తరగతి పిల్లలు అమెరికన్‌ ఉచ్ఛారణ (American English)తో గడగడా ఇంగ్లిష్‌ మాట్లాడుతుంటే... అంతా అబ్బురంగా విన్నారు. ‘బెండపూడి పిల్లలు భళా’ అని పొగిడారు. ఇక... వైసీపీ నేతలు ‘ఇదంతా మా ఘనతే. జగన్‌ ఇంగ్లిష్‌ మీడియం పెట్టినందునే’ అని గొప్పలకు

Bendapudi American English: బెండపూడి ‘బడాయేనా’.. నిగ్గుతేల్చిన రిటైర్డ్‌ ఐఏఎస్‌!
నిగ్గుతేల్చిన...

అమెరికన్‌ ఇంగ్లిష్‌ బాగోతం బట్టబయలు

కొత్త అంశాలపై మాట్లాడమంటే మౌనమే

హెచ్‌ఆర్‌డీ కార్యదర్శి ఉషాకుమారి పరిశీలన

ప్రచార కోసం పిల్లల భవిష్యత్తుతో ఆటలా?

ఉపాధ్యాయులపై మండిపడిన అధికారిణి

(కాకినాడ - ఆంధ్రజ్యోతి): ఏడెనిమిది తరగతి పిల్లలు అమెరికన్‌ ఉచ్ఛారణ (American English)తో గడగడా ఇంగ్లిష్‌ మాట్లాడుతుంటే... అంతా అబ్బురంగా విన్నారు. ‘బెండపూడి పిల్లలు భళా’ అని పొగిడారు. ఇక... వైసీపీ నేతలు ‘ఇదంతా మా ఘనతే. జగన్‌ ఇంగ్లిష్‌ మీడియం పెట్టినందునే’ అని గొప్పలకు పోయారు. తీరాచూస్తే... బెండపూడి ఇంగ్లిష్‌లో బడాయే ఎక్కువని తేలింది. కేవలం రాజకీయ ప్రముఖుల ముందు, మీడియా ముందు గొప్పలు పోయేందుకు పిల్లల చేత కొన్ని వాక్యాలు బట్టీ పట్టించి, వాటినే చెప్పించారని తేలింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... రిటైర్డ్‌ ఐఏఎస్‌, మానవ వనరుల అభివృద్ధి విభాగం (హెచ్‌ఆర్‌డీ) కార్యదర్శి ఉషాకుమారి గురువారం కాకినాడ జిల్లా బెండపూడి పాఠశాల (Bendapudi school) ను సందర్శించారు. రాష్ట్ర విద్యా శిక్షణ, పరిశోధన సంస్థ (ఎన్‌సీఈఆర్టీ) సబ్జెక్ట్‌ నిపుణురాలు శ్రీలక్ష్మి కూడా ఆమెతో ఉన్నారు. గతంలో గలగలా ఆంగ్లంలో మాట్లాడిన కొందరు పిల్లలతో ఉషాకుమారి ముచ్చటించారు. వారు కొన్ని సాధారణ అంశాలపై అసాధారణమైన ఉచ్ఛారణలో మాట్లాడేశారు. అయితే.. ఇదంతా ముందుగా బట్టీ పట్టిన వ్యవహారమని ఉషాకుమారి గ్రహించారు. అప్పటికప్పుడు ఏదైనా కొత్త విషయం మాట్లాడాలని అడిగారు. ‘నేను, మీ హెడ్మాస్టర్‌ క్రికెట్‌ ఆడుతున్నాం. దీనిని విడమరిచి చెప్పండి’ అని అడిగితే పిల్లలెవరూ మాట్లాడలేకపోయారు. ‘మీ స్కూల్‌లో ఒక కార్యక్రమం జరుగుతోంది. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించాలి. వేదికపై ఉన్న వారిని కిందికి వెళ్లాల్సిందిగా ఎలా చెబుతారు?’ అని మరో ప్రశ్న అడిగారు. దీనిపైనా విద్యార్థులు స్పందించలేదు. దీంతో ఉషాకుమారి విస్తుపోయారు. బట్టీపట్టి చెప్పడమే తప్ప వారికి ఇంగ్లిష్‌ (English)లో ఎలాంటి ప్రావీణ్యంలేదని, వ్యాకరణ దోషాలున్నాయని గుర్తించారు. ‘‘ఇక్కడ ఇంత బాగోతం జరుగుతోందా? మీ ప్రచారం కోసం పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటారా? భాషలో ఫొనెటిక్స్‌ ముఖ్యం! మనకు అమెరికన్‌ (American) యాక్సెంట్‌తో పనేముంది?’’ అని ప్రశ్నించారు. పిల్లలతో ‘మగ్గింగ్‌’ (బట్టీ కొట్టించడం) చేయిస్తున్నారని తప్పుపట్టారు. ‘అమెరికన్‌ ఇంగ్లిష్‌లో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు’ అంటూ ప్రశంసలు పొందుతున్న ప్రసాద్‌ అనే ఉపాధ్యాయుడిని సైతం మందలించారు. అంతేకాదు ‘ఇంగ్లిష్‌ క్రెడిట్‌’ ముసుగులో ఆయన జూన్‌ నుంచి సరిగ్గా విధులు నిర్వహించడంలేదని గుర్తించి మండిపడ్డారు.

ఇది కూడా చదవండి: కాల్‌గర్ల్‌ను బుక్ చేసుకున్న ఇద్దరు కుర్రాళ్లకు దిమ్మతిరిగే షాక్.. ఆ యువతి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలతో బిత్తరపోయి పరార్..!

ఫాల్స్‌ ప్రిస్టేజ్‌ సృష్టించి...

బెండపూడి పాఠశాల (Bendapudi School)లో చంద్రబాబు ప్రభుత్వ హయాం (Chandrababu Government) నుంచే ఇంగ్లిష్‌ మీడియం అమలవుతోంది. అయితే... 8, 9, 10వ తరగతి చదువుతున్న కొందరు ఎంపిక చేసిన విద్యార్థులకు గతేడాదిగా అమెరికా ఇంగ్లిష్‌ ఉచ్ఛారణలో శిక్షణ ఇస్తున్నారు. వీరు అమెరికాలోని విద్యార్థులతో ఆన్‌లైన్‌ డిబేట్‌లలో పాల్గొంటున్నారు. ఇది మంచిదే! కానీ... వీరంతా అమెరికా ఇంగ్లీషు ఉచ్ఛారణలో ఆరితేరిపోయారంటూ సోషల్‌ మీడియా, మీడియా ద్వారా అతి ప్రచారం చేశారు. ఆ వెంటనే... విద్యాశాఖ రంగంలోకి దిగింది. గతేడాది మే 19న కొందరు ఎంపిక చేసిన విద్యార్థులను సీఎం జగన్‌ (Cm jagan) వద్దకు తీసుకెళ్లారు. ‘‘ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంవల్ల మాలాంటి మారుమూల పాఠశాల విద్యార్థులం కూడా అద్భుతంగా ఇంగ్లి‌ష్‌లో మాట్లాడగలుతున్నాం. మీరు చాలా గొప్ప ముఖ్యమంత్రి. మీ విధానాలు అద్భుతం’’ అంటూ విద్యార్థులు జగన్‌ను అమెరికన్‌ ఇంగ్లిష్‌లో తెగ పొగిడారు. అయితే... సందర్భాన్ని బట్టి ముందుగానే కొన్ని వాక్యాలు బట్టీ కొట్టించి, వాటినే చెప్పిస్తున్నారని ఇప్పుడు ఉషాకుమారి పరిశీలనలో స్పష్టమైంది.

ఇది కూడా చదవండి: ఆర్టీసీ బస్సులో ఓ యువతిపై మూత్ర విసర్జన చేసిన 25 ఏళ్ల యువకుడు.. విమానంలోనే కాదు.. బస్సులోనూ అదే సీన్ రిపీట్..!

Updated Date - 2023-02-24T12:04:38+05:30 IST