Lose weight: బరువులతో బరువు తగ్గొచ్చా! దీంట్లో నిజమెంత?

ABN , First Publish Date - 2023-08-24T11:30:37+05:30 IST

సన్నబడాలంటే వ్యాయామం చేయాలి అని వైద్యులంటున్నారు. నా వయసు 40 ఏళ్లు. ఈ వయసులో నేనెలాంటి వ్యాయామాలను ఎంచుకోవచ్చు. జిమ్‌లో ఎలాంటి వ్యాయామాలు చేయవచ్చు. ఎలాంటి నియమాలు పాటించాలి?

Lose weight: బరువులతో బరువు తగ్గొచ్చా! దీంట్లో నిజమెంత?

ప్రశ్న: సన్నబడాలంటే వ్యాయామం చేయాలి అని వైద్యులంటున్నారు. నా వయసు 40 ఏళ్లు. ఈ వయసులో నేనెలాంటి వ్యాయామాలను ఎంచుకోవచ్చు. జిమ్‌లో ఎలాంటి వ్యాయామాలు చేయవచ్చు. ఎలాంటి నియమాలు పాటించాలి?

- ఓ సోదరి, హైదరాబాద్‌.

బిగినర్స్‌ ఒకేసారి ఎక్కువ తీవ్రతతో కూడిన వ్యాయామాలను ఎంచుకోకూడదు. మొదట వార్మప్‌ చేసి, తర్వాత కార్డియో వ్యాయామాలు చేయాలి. తర్వాత శరీర తత్వం, వయసు, వ్యాయామ అనుభవం, ఆరోగ్య సమస్యలను బట్టి వెయిట్‌ ట్రైనింగ్‌ చేయవలసి ఉంటుంది. పాతికేళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న వాళ్లు నేరుగా బరువులతో కూడిన వ్యాయామాలు చేసేయవచ్చు. కానీ 40 ఏళ్లు దాటిన వాళ్లు కార్డియో తర్వాత, నెమ్మదిగా దశల వారీగా వెయింట్‌ ట్రైనింగ్‌ మొదలు పెట్టుకోవాలి.

బరువులతో బరువు తగ్గవచ్చు

మహిళలు వెయిట్‌ ట్రైనింగ్‌ చేస్తే కండలు పెరిగిపోతాయనేది అపోహ మాత్రమే! వెయుట్‌ ట్రైనింగ్‌తో బాడీ టోన్‌ అవుతుంది. బాడీ బిల్డ్‌ అవదు. తక్కువ బరువులతో చేసే వ్యాయామాలతో అదనపు కొవ్వులు కరిగి, ఫిట్‌నెస్‌, స్ట్రెంగ్త్‌ పెరుగుతాయి. దాంతో మహిళలు బరువు తగ్గడంతో పాటు ఇంట్లో పనులను కూడా తేలికగా చేసుకోగలుగుతారు. అలాగే వెయిట్‌ ట్రైనింగ్‌తో ఎముకలు కూడా బలపడతాయి. 40 ఏళ్లు పైబడిన వాళ్లు, రెండు నుంచి ఐదు కిలోల బరువులతో వ్యాయామాలు చేయాలి.

డైట్‌ ఇలా...

వ్యాయామం ముందు వార్మప్‌, వ్యాయామం తర్వాత స్ట్రెచింగ్‌ చేయడం కీలకం. వీటితో శరీరం ఫ్లెక్సిబుల్‌గా మారుతుంది. అలాగే బరువు తగ్గడానికి పిండి పదార్థాలు తక్కువగా, మాంసకృత్తులు ఎక్కువగా తినాలి. అలాగే ప్రొటీన్‌ పౌడర్లు కూడా వాడుకోవచ్చు. అలాగే వ్యాయామానికి గంట ముందు గుడ్లు, బ్రౌన్‌ బ్రెడ్‌ లాంటి స్నాక్స్‌ తీసుకోవాలి. భారీ భోజనం తినవలసి వస్తే, వ్యాయామానికి మూడు నుంచి నాలుగు గంటల ముందే తినేయాలి. వ్యాయామం తర్వాత ఐదు నుంచి పది నిమిషాల పాటు ఆగి ఆహారం తీసుకోవాలి. ఐసొలేట్‌ ప్రొటీన్‌, కాన్‌సెంటేట్‌ ప్రొటీన్లలో వెయిల్‌లాస్‌ కోసం ఐసొప్రొటీన్‌ తీసుకోవచ్చు.

ఫిట్‌నెస్‌ కోసం వే ప్రొటీన్‌ తీసుకోవచ్చు.

సురేందర్‌ సింగ్‌, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌,

మయాంక్‌ ఫిట్‌నెస్‌ యూనిసెక్స్‌ జిమ్‌,

షేక్‌పేట్‌, హైదరాబాద్‌.

Updated Date - 2023-08-24T11:30:37+05:30 IST