Share News

Eggs: గుడ్డు మంచిదేనా? అపోహల వెనకున్న నిజమేంటి?

ABN , First Publish Date - 2023-12-09T12:29:49+05:30 IST

కోడిగుడ్డు వల్ల వచ్చే లాభాలు అందరికీ తెలిసినవే. అయితే ఇప్పటికీ అనేక రకాల అపోహలు ప్రచారంలో ఉన్నాయి. ఆ అపోహల వెనకున్న నిజాలేమిటో చూద్దాం.

Eggs: గుడ్డు మంచిదేనా? అపోహల వెనకున్న నిజమేంటి?

కోడిగుడ్డు వల్ల వచ్చే లాభాలు అందరికీ తెలిసినవే. అయితే ఇప్పటికీ అనేక రకాల అపోహలు ప్రచారంలో ఉన్నాయి. ఆ అపోహల వెనకున్న నిజాలేమిటో చూద్దాం.

అపోహ: బ్రౌన్‌ కలర్‌ గుడ్లలో ఎక్కువ పౌష్టిక పదార్థాలు ఉంటాయి..

నిజం: తప్పు. గుడ్డు ఏ రంగులో ఉన్నా- దానిలో ఉండే పౌష్టికాలు ఒక్కటే! కోడి చెవి చివరి భాగం తెల్లగా ఉంటే- అది తెల్ల గుడ్లు పెడుతుంది. ఎర్రగా ఉంటే అది బ్రౌన్‌ రంగులో ఉన్న గుడ్లు పెడుతుంది. అంత కన్నా తేడా ఏమి ఉండదు.

అపోహ: గుడ్లలో ఉండే సొన తినటం వల్ల బరువు పెరుగుతారు

నిజం: తప్పు. కోడి గుడ్డు సొనలో విటమిన్లు, ప్రొటీన్లు, మినరల్స్‌ ఉంటాయి. దీనిని తినటానికి బరువు పెరగటానికి ఎటువంటి సంబంధం లేదు.

అపోహ: గుడ్డును కడిగితే మంచిది..

నిజం: చాలా మంది గుడ్లను కడగటం వల్ల బ్యాక్టీరియా పోతుందని భావిస్తారు. కానీ అది నిజం కాదు. గుడ్లపై ఉండే సాల్మోనిలా అనే బ్యాక్టీరియా కొన్ని రకాల జబ్బులను కలగజేస్తుంది. గుడ్డును కడిగినప్పుడు ఈ బ్యాక్టీరియా లోపలికి చేరే అవకాశముంటుంది. కనుక గుడ్డును కడగకపోవటమే మంచిది.

అపోహ: గుడ్లు తింటే పింపుల్స్‌ వస్తాయి..

నిజం: తప్పు. గుడ్లను తినటం వల్ల మృదువైన చర్మానికి కావాల్సిన పౌష్టికపదార్థాలన్నీ శరీరానికి అందుతాయి. అంతే తప్ప పింపుల్స్‌ రావు.

అపోహ: ఎక్కువ గుడ్లు తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయి.

నిజం: ఎన్ని గుడ్లను తినాలనేదానిపై కచ్చితమైన లెక్కలేమి లేవు. శరీర బరువు, ఆరోగ్య సమస్యలు, అలర్జీలు మొదలైన వాటి ఆధారంగా గుడ్లను తినాలి.

Updated Date - 2023-12-09T12:29:50+05:30 IST