Share News

Israeil: ఇజ్రాయెల్ ఇన్‌ఫార్మర్లను హతమార్చిన పాలస్తీనా ఉగ్రవాదులు

ABN , First Publish Date - 2023-11-26T09:10:12+05:30 IST

ఇజ్రాయెల్‌(Israeil)కు చెందిన ఇద్దరు ఇన్‌ఫార్మర్‌లను శనివారం తెల్లవారుజామున వెస్ట్ బ్యాంక్‌(West Bank)లోని తుల్కరేమ్ శరణార్థి శిబిరంలో పాలస్తీనా ఉగ్రవాదులు హతమార్చారు. ఒక గుంపు వారి మృతదేహాలను వీధుల్లోకి లాగి, తన్నుతూ విద్యుత్ స్తంభానికి వేలాడదీసింది.

Israeil: ఇజ్రాయెల్ ఇన్‌ఫార్మర్లను హతమార్చిన పాలస్తీనా ఉగ్రవాదులు

గాజా: ఇజ్రాయెల్‌(Israeil)కు చెందిన ఇద్దరు ఇన్‌ఫార్మర్‌లను శనివారం తెల్లవారుజామున వెస్ట్ బ్యాంక్‌(West Bank)లోని తుల్కరేమ్ శరణార్థి శిబిరంలో పాలస్తీనా ఉగ్రవాదులు హతమార్చారు. ఒక గుంపు వారి మృతదేహాలను వీధుల్లోకి లాగి, తన్నుతూ విద్యుత్ స్తంభానికి వేలాడదీసింది. సంబంధిత వీడియోలో ఓ సమూహం ఇన్‌ఫార్మర్లిద్దరిని ఉద్దేశిస్తూ "ద్రోహులు" అని నినాదిస్తుండటం కనిపిస్తోంది.

ఇజ్రాయెల్, హమాస్(Hamas) మధ్య సంధి కుదిరిన రెండో రోజు ఈ ఘటన జరిగింది. నవంబర్ 6న తుల్కరేమ్ శరణార్థి శిబిరంలో ఇద్దరు పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ భద్రతా దళాలకు సహాయం చేశారని స్థానిక మిలిటెంట్ గ్రూప్ ఆరోపించింది. శరణార్థి శిబిరంలో జరిగిన దాడిలో ముగ్గురు కీలక ఉగ్రవాదులు హతమైనట్లు పాలస్తీనా భద్రతా అధికారి తెలిపారు. మృతులను 31 ఏళ్ల హంజా ముబారక్, 29 ఏళ్ల ఆజం జుబ్రాగా గుర్తించారు.


సంబంధిత వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో ఓ గుంపు వారిపై దుర్భాషలాడుతూ ఉంటుంది. వారిలో చాలా మంది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) కోసం పనిచేశారని హమాస్ ఆరోపించింది. తమ పౌరుల ప్రాణ నష్టంలో ప్రమేయం ఉన్నట్లు తెలిస్తే వారిని విడిచిపెట్టబోమని ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది. సదరు వ్యక్తులకు మరణశిక్ష విధిస్తామని హెచ్చరించింది. అయితే, ఉరిశిక్షల గురించి హమాస్, IDFలు ఎటువంటి అధికారిక ప్రకటనలు చేయలేదు.

13 మంది ఇజ్రాయెల్ బందీలను, నలుగురు థాయ్ జాతీయులను హమాస్ విడుదల చేయడంతో బదులుగా, హమాస్‌తో నాలుగు రోజుల పాటు శత్రుత్వానికి ఇజ్రాయెల్ విరామం ఇచ్చింది. ఇందులో భాగంగా ఆరుగురు మహిళలు, 33 మంది పిల్లలతో సహా 39 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ జైళ్ల నుండి విడుదల చేశారు. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ హమాస్ బందీల విడుదల ఆలస్యంగా చేసింది.

శుక్రవారం, 13 మంది ఇజ్రాయెల్‌లతో సహా 24 మంది బందీలను, హమాస్ విడుదల చేసి ఇజ్రాయెల్ అధికారులకు అప్పగించింది. మొత్తంమీద, హమాస్ సమూహం 240 మంది బందీలలో 50 మందిని విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు, కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ 150 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాలని భావిస్తోంది.

Updated Date - 2023-11-26T09:13:31+05:30 IST