Delhi: ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ ఇంట్లో సీఆర్‌పీఎఫ్ జవాన్ ఆత్మహత్య

ABN , First Publish Date - 2023-02-04T11:33:49+05:30 IST

ఢిల్లీలోని ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ ఇంట్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం...

Delhi: ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ ఇంట్లో సీఆర్‌పీఎఫ్ జవాన్ ఆత్మహత్య
CRPF jawan shoots self

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ ఇంట్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపింది.(CRPF jawan) ఢిల్లీలోని(Delhi) తుఘ్లక్ రోడ్డులో ఉన్న ఇంటెలిజెన్స్ బ్యూరో(Intelligence Bureau) డైరెక్టరు ఇంట్లో విధుల్లో ఉన్న సీఆర్ పీఎఫ్ ఎస్ఐ రాజ్ బిర్ కుమార్ తన ఏకే -47 రైఫిల్ తో రెండు రౌండ్లు కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.(Si shoots self) సీఆర్ పీఎఫ్ ఎస్ఐ వయసు 53 ఏళ్లని ఇతని ఆత్మహత్యకు కారణాలు తెలియలేదు. గత కొంతకాలంగా సెలవులో ఉన్న రాజ్ బిర్ కుమార్ ఇటీవల విధుల్లో చేరారు. ఎస్ఐ ఆత్మహత్య ఘటనపై అతని కుటుంబసభ్యులకు ఢిల్లీ పోలీసులు సమాచారం అందించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - 2023-02-04T11:33:50+05:30 IST