Earthquake: జమ్మూకశ్మీరులో మళ్లీ భూప్రకంపనలు

ABN , First Publish Date - 2023-02-17T09:42:57+05:30 IST

జమ్మూకశ్మీరులో శుక్రవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ...

Earthquake: జమ్మూకశ్మీరులో మళ్లీ భూప్రకంపనలు
Earthquake hits Jammu and Kashmir

శ్రీనగర్ : జమ్మూకశ్మీరులో శుక్రవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. (Earthquake)జమ్మూకశ్మీరులోని(Jammu and Kashmir) కట్రా ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదైంది.శుక్రవారం సంభవించిన భూకంపం 10కిలోమీటర్ల లోతులో సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ(National Center for Seismology) ట్వీట్ (Tweet)చేసింది.

ఈ భూకంపం వల్ల జమ్మూకశ్మీరులో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెప్పారు. కట్రా పట్టణానికి తూర్పున 97 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించడంతో ఇక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఈ నెల 13వతేదీన సిక్కింలో( Sikkim) భూకంపం సంభవించింది. సిక్కింలోని యుక్ సంలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది.

Updated Date - 2023-02-17T09:43:02+05:30 IST