Ilayaraja, DSP: ఇళయరాజా ఆశీస్సులు అందుకున్న దేవిశ్రీప్రసాద్‌

ABN , First Publish Date - 2023-08-27T09:40:15+05:30 IST

తాజాగా కేంద్రప్రభుత్వం ప్రకటించిన 69వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డును సొంతం చేసుకున్న ప్రముఖ

Ilayaraja, DSP: ఇళయరాజా ఆశీస్సులు అందుకున్న దేవిశ్రీప్రసాద్‌

అడయార్‌(చెన్నై): తాజాగా కేంద్రప్రభుత్వం ప్రకటించిన 69వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డును సొంతం చేసుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌(Devishri Prasad) శనివారం ఇసైజ్ఞాని ఇళయరాజా(Ilayaraja)ను స్థానిక కోడంబాక్కం లోని ఇళయరాజా స్టూడియోలో మర్యాదపూర్వకంగా కలుసుకుని ఆయన ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఇళయరాజాకు చిన్న పాటి బహుమతి ఇచ్చిన దేవీశ్రీ ప్రసాద్‌(DSP)... ఆ తర్వాత ఇళ యరాజాకు పాదాభివందనం చేశా రు. ఈ సందర్భంగా డీఎస్పీని ఇసైజ్ఞాని అభినందించారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను డీఎస్పీ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు. ‘జాతీయ అవార్డును పొందేందుకు అన్ని విధాలుగా ప్రోత్సహించిన ఇళయరాజాకు కృతజ్ఞతలు. జాతీయ అవార్డుల జాబితాలో చోటు దక్కించుకున్నందుకు ఆయన్ను కలుసుకుని ఆశీస్సులు తీసుకున్నాను. మీరిచ్చిన సూచనలు, సలహాలు, ప్రోత్సాహమే ఈ అవార్డు వరకు తీసుకెళ్లాయి’ అని పేర్కొన్నారు.

nani5.2.jpg

Updated Date - 2023-08-27T09:40:16+05:30 IST