Share News

Mansoor Ali Khan, Trisha: మన్సూర్‌ అలీఖాన్‌ అంశం.. నటి త్రిష వద్ద కూడా విచారణ!

ABN , First Publish Date - 2023-11-26T08:01:04+05:30 IST

నటి త్రిష(Actress Trisha)ను ఉద్దేశించి విలక్షణ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌(Mansoor Ali Khan) చేసిన అనుచిత వ్యాఖ్యల విషయంపై

Mansoor Ali Khan, Trisha: మన్సూర్‌ అలీఖాన్‌ అంశం.. నటి త్రిష వద్ద కూడా విచారణ!

- పోలీసుల నిర్ణయం

అడయార్‌(చెన్నై): నటి త్రిష(Actress Trisha)ను ఉద్దేశించి విలక్షణ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌(Mansoor Ali Khan) చేసిన అనుచిత వ్యాఖ్యల విషయంపై స్థానిక థౌజండ్‌లైట్స్‌ పోలీసులు న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారు. జాతీయ మహిళా కమిషన్‌ ఆదేశం మేరకు మన్సూర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత 41ఏ కింద నోటీసు ఇచ్చి 35 నిమిషాల పాటు విచారణ జరిపారు. అయితే, ఈ కేసులో ఆయన్ను అరెస్టు చేస్తారంటూ ప్రచారం జరిగినప్పటికీ ఆ దిశగా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై పోలీసులు న్యాయనిపుణుల సలహాను తీసుకుంటున్నారు. మరోవైపు, ఇదే కేసులో సినీ నటి త్రిష వద్ద కూడా విచారణ జరపాలని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం. కాగా, తాను చేసిన అనుచిత వ్యాఖ్యలపై మన్సూర్‌ అలీఖాన్‌... నటి త్రిషకు సారీ చెప్పడం ఆమె క్షమించడంతో ఈ వ్యవహారం సద్దుమణిగిపోయిన విషయం తెల్సిందే. అయితే, జాతీయ మహిళా కమిషన్‌ ఆదేశం మేరకు నమోదు చేసిన కేసు విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు.

nani3.jpg

Updated Date - 2023-11-26T08:01:06+05:30 IST