Share News

National Herald case: రూ.752 కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఈడీ

ABN , First Publish Date - 2023-11-21T19:58:35+05:30 IST

నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ కింద రూ.751.9 కోట్ల విలువచేసే ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. ఈడీ అటాచ్ చేసిన ఆస్తులలో ఢిల్లీ, ముంబైలోని నేషనల్ హెరాల్డ్ హౌస్‌లు, లక్నోలోని నెహ్రూ భవన్‌ కూడా ఉన్నాయి.

National Herald case: రూ.752 కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఈడీ

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald case)లో మనీ లాండరింగ్ కింద రూ.751.9 కోట్ల విలువచేసే ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) జప్తు చేసింది. ఈడీ అటాచ్ చేసిన ఆస్తులలో ఢిల్లీ, ముంబైలోని నేషనల్ హెరాల్డ్ హౌస్‌లు, లక్నోలోని నెహ్రూ భవన్‌ కూడా ఉన్నాయి. అసోసియేట్ జర్నల్స్‌కు చెందిన ఈ ఆస్తుల విలువ రూ.752 కోట్లు ఉంటుందని ఈడీ వర్గాలు తెలిపాయి.


అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌ను యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ మోసపూరితంగా సొంతం చేసుకుందని ఈడీ అభియోగంగా ఉంది. మనీ లాండరింగ్ కింద కేసు విచారణ జరుగుతోంది. ఈ కేసులో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీని ఏజెన్సీ ఇప్పటికే ప్రశ్నించింది. అయితే, మనీలాండరింగ్ జరిగినట్టు కానీ, మానిటరీ ఎక్స్ఛేంజ్‌ జరిగిందనటానికి కానీ ఎలాంటి సాఖ్యాలు లేవని కాంగ్రెస్ చెబుతోంది. రాజకీయ కక్షతోనే దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తోంది.

Updated Date - 2023-11-21T19:58:36+05:30 IST