Home » money laundering
ఈడీ చార్జిషీటును పరిగణనలోకి తీసుకుని విచారణకు ట్రయిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడాన్ని చిదంబరం హైకోర్టులో సవాలు చేశారు. దీనిపై సింగిల్ జడ్జి తాజా ఆదేశాలు జారీ చేస్తూ, చిదంబర పిటిషన్‌పై స్పందించాలని ఈడీని ఆదేశించారు. తదుపరి విచారణను 2025 జనవరికి వాయిదా వేశారు.
విచారణలో జాప్యం, ఎక్కువ కాలం నిర్బంధంలో ఉంచిన కారణంగా సత్యేంద్ర జైన్‌కు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. విచారణకు తెరపడేటట్టు కనిపించడం లేదని కూడా కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
‘‘కేసును విచారించే కోర్టు మారినా.. విషయం మారదు కదా?’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఓటుకు నోటు కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ దాఖలైన వ్యాజ్యంపై అత్యున్నత న్యాయస్థానం పైవిధంగా స్పందించింది.
జీవిత బీమా సొమ్ము పొందేందుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టు నమ్మించారు. అందుకు అవసరమైన మృతదేహం కోసం ఓ యాచకుడిని హత్య చేశారు.
డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడగారనే కారణంగా లోక్‌సభ ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోయిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా మరిన్ని చిక్కుల్లో పడ్డారు. 'క్యాష్ ఫర్ క్యారీ' దర్యాప్తులో భాగంగా ఆమెపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కేసును మంగళవారంనాడు నమోదు చేసింది.
ఆర్బీఐ నిషేధం తరువాత పేటీఎం పేమెంట్స్‌కు (Paytm) మరో షాక్ తగలింది. ఫిన్‌టెక్ దిగ్గజ కంపెనీ అయిన పేటీఎం పేమెంట్స్‌కు కేంద్ర ఆర్థిక శాఖ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ - ఇండియా(FIU-IND) భారీ జరిమానా విధించింది. పేటీఎం మనీలాండరింగ్‌కు పాల్పడిందనే కారణంతో జరిమానా విధించినట్లు కేంద్రం తెలిపింది.
నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ కింద రూ.751.9 కోట్ల విలువచేసే ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. ఈడీ అటాచ్ చేసిన ఆస్తులలో ఢిల్లీ, ముంబైలోని నేషనల్ హెరాల్డ్ హౌస్‌లు, లక్నోలోని నెహ్రూ భవన్ కూడా ఉన్నాయి.