Share News

Cash for Query Probe: మహువా మొయిత్రాపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు

ABN , Publish Date - Apr 02 , 2024 | 09:08 PM

డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడగారనే కారణంగా లోక్‌సభ ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోయిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా మరిన్ని చిక్కుల్లో పడ్డారు. 'క్యాష్ ఫర్ క్యారీ' దర్యాప్తులో భాగంగా ఆమెపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కేసును మంగళవారంనాడు నమోదు చేసింది.

Cash for Query Probe: మహువా మొయిత్రాపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు

న్యూఢిల్లీ: డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడగారనే (Cash for query) కారణంగా లోక్‌సభ ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోయిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) మరిన్ని చిక్కుల్లో పడ్డారు. 'క్యాష్ ఫర్ క్యారీ' దర్యాప్తులో భాగంగా ఆమెపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మనీ లాండరింగ్ కేసును మంగళవారంనాడు నమోదుచేసింది. ఈ కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ కేసును ఈడీ రిజిస్టర్ చేసింది. ఢిల్లీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలంటూ ఈడీ ఇటీవల ఇచ్చిన సమన్లను మహువా మొయిత్రా బేఖాతరు చేసిన నేపథ్యంలో ఈడీ తాజా చర్యకు దిగింది. 'ఫెమా' చట్టా్న్ని ఉల్లంఘించారనే కారణంగా ఆమెతో పాటు వ్యాపారవేత్త దర్శన్ హిరానందానికి ఈడీ సమన్లు జారీచేసింది.


ఈ కేసులో బీజేపీ ఎంపీ నిషాకాంత్ దుబే ఇచ్చిన ఫిర్యాదు మేరకు లోక్‌పాల్ ఇచ్చిన ఆదేశాలతో మహువా మొయిత్రా నివాసాలపై కొద్ది కాలం క్రితం సీబీఐ దాడులు జరిపింది. అనంతరం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 'క్యాష్ ఫర్ క్వారీ' వ్యవహారంలో లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయిన మొయిత్రాకు తాజా లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) తిరిగి టిక్కెట్ ఇచ్చింది. పశ్చిమబెంగాల్‌లోని కృష్ణనగర్ నుంచి ఆమె పోటీలో ఉన్నారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 02 , 2024 | 09:08 PM