Share News

PM Modi: విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్రలో చురుగ్గా పాల్గొనండి.. మంత్రులను కోరిన మోదీ

ABN , First Publish Date - 2023-11-29T07:51:26+05:30 IST

కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర( Viksit Bharat Sankalp Yatra)లో చురుగ్గా పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) కేంద్ర మంత్రులను కోరారు.

PM Modi: విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్రలో చురుగ్గా పాల్గొనండి.. మంత్రులను కోరిన మోదీ

ఢిల్లీ : కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర( Viksit Bharat Sankalp Yatra)లో చురుగ్గా పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) కేంద్ర మంత్రులను కోరారు. నిన్న కేంద్ర మంత్రుల మండలి సమావేశంలో ప్రధాని విక్షిత్ భారత్ సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.

సమాజంలోని వివిధ వర్గాల వారికి మేలు జరిగేలా రూపొందించిన పథకాల ప్రచారం చేయడంపై మంత్రులు దృష్టి సారించాలని కోరారు. 2.55 లక్షల గ్రామ పంచాయతీలు, పట్టణ ప్రాంతాల్లోని దాదాపు 18 వేల స్థానాల్లో ప్రభుత్వ పథకాల ప్రచారానికి వాహనాలు సిద్ధమయ్యాయి.

IEC (Information Education and Communication) వ్యాన్‌లు, కిసాన్ క్రెడిట్ కార్డ్, రూరల్ హౌసింగ్ స్కీమ్, ఉజ్వల స్కీమ్, PM స్వానిధి యోజన వంటి వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలను వాహనాలపై ప్రదర్శిస్తున్నారు.


యాత్రలో భాగంగా, దేశంలోని అన్ని నగరాలు, పట్టణాల్లోని 2.55 లక్షల గ్రామ పంచాయతీలు, క్లస్టర్‌లను కవర్ చేయడానికి 2,500కిపైగా మొబైల్ పెర్ఫార్మింగ్ వ్యాన్‌లు, 200లకు పైగా మొబైల్ థియేటర్ వ్యాన్‌లు తిరగనున్నాయి. ప్రధాని నవంబర్ 15న జార్ఖండ్ కుంతి నుంచి ఈ యాత్రను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన ఐదు IEC వ్యాన్‌లను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. దేశవ్యాప్తంగా గణనీయమైన గిరిజన జనాభా ఉన్న జిల్లాల్లో సైతం ఈ వ్యాన్లు తిరుగుతున్నాయి.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని కేంద్ర పథకాల లబ్ధిదారులను చేరకునే ప్రచారం జనవరి 25, 2024న ముగుస్తుంది. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి లబ్ధి పొందాలని బీజేపీ భావిస్తోంది. అందుకే వినూత్న ప్రచారం చేస్తోంది.

Updated Date - 2023-11-29T07:51:27+05:30 IST