PM Modi : విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాల్లో పెను మార్పులు : మోదీ

ABN , First Publish Date - 2023-02-28T14:46:11+05:30 IST

విద్య, వైద్యం, వ్యవసాయం వంటి అనేక రంగాల్లో 5జీ, కృత్రిమ మేధాశక్తి వంటి టెక్నాలజీల వల్ల పెను మార్పులు వస్తాయని

PM Modi : విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాల్లో పెను మార్పులు : మోదీ
Narendra Modi

న్యూఢిల్లీ : విద్య, వైద్యం, వ్యవసాయం వంటి అనేక రంగాల్లో 5జీ, కృత్రిమ మేధాశక్తి వంటి టెక్నాలజీల వల్ల పెను మార్పులు వస్తాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) చెప్పారు. సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యల్లో కృత్రిమ మేధాశక్తి (Artificial Intelligence)తో పరిష్కరించగలిగిన 10 సమస్యలను గుర్తించాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే లక్ష్యాన్ని సాధించడానికి టెక్నాలజీ దోహదపడుతుందన్నారు. డిజిటల్ విప్లవం ఫలితాలు ప్రజలందరికీ చేరేవిధంగా చేయడం కోసం ఆధునిక డిజిటల్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ‘‘సామర్థ్యాన్ని వెలికి తీయడం : టెక్నాలజీని ఉపయోగించుకుంటూ సులువుగా జీవించడం’’ అనే శీర్షికతో జరిగిన వెబినార్‌లో మోదీ మాట్లాడారు. డిజిటల్ విప్లవం ఫలితాలు ప్రజలందరికీ చేరేవిధంగా చేయడం కోసం ఆధునిక డిజిటల్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చిన్న తరహా వ్యాపార సంస్థలు నిబంధనలను పాటించడం కోసం చేయవలసిన ఖర్చులను తన ప్రభుత్వం తగ్గించాలనుకుంటోందని తెలిపారు. తొలగించదగిన అనవసరమైన ఖర్చుల (compliance cost) జాబితాను తయారు చేయాలని పారిశ్రామిక రంగాన్ని కోరారు. తన ప్రభుత్వం ఇప్పటి వరకు 40,000 కాంప్లియెన్స్ కాస్ట్‌లను తొలగించిందని చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయం వంటి అనేక రంగాల్లో 5జీ, కృత్రిమ మేధాశక్తి వంటి టెక్నాలజీల వల్ల పెను మార్పులు వస్తాయన్నారు. ప్రజల జీవితాల్లో నాణ్యమైన మేలు రకపు మార్పులను తీసుకొచ్చే విధంగా టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు తెలిపారు.

పన్ను విధింపు, చెల్లింపు, మదింపు విధానాలను సంస్కరించినట్లు తెలిపారు. వ్యక్తులు సుదూరంగా ఉంటూ, ప్రత్యక్షంగా హాజరవ్వాల్సిన అవసరం లేకుండా పని చేసేలా దీనిని తీర్చిదిద్దినట్లు తెలిపారు. పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ఈ విధానాలు ఉపయోగపడతాయన్నారు. ఒక దేశం-ఒకే రేషన్ పథకానికి కూడా ప్రాతిపదిక టెక్నాలజీయేనని చెప్పారు.

ప్రత్యక్ష పన్నుల సంస్కరణల్లో భాగంగా అమల్లోకి తీసుకొచ్చిన ఫేస్‌లెస్ అసెస్‌మెంట్ స్కీమ్ గురించి మోదీ ప్రస్తావించారు. సమర్థత, పారదర్శకత, జవాబుదారీతనం ఆధారంగా ఈ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది.

ఇవి కూడా చదవండి :

Puli Meka web series Review: ఆసక్తికరంగా వున్న పులి మేక ఆట

NRI TDP USA: ఆస్టిన్‌లో ఎన్టీఆర్ శ‌త‌ జ‌యంతి.. 'జ‌య‌రాం కోమ‌టి' ఆధ్వ‌ర్యంలో విజయవంతం!

Updated Date - 2023-02-28T14:46:11+05:30 IST