The Kerala Story:సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిసిన కేరళ స్టోరీ టీమ్

ABN , First Publish Date - 2023-05-11T13:32:00+05:30 IST

ది కేరళ స్టోరీ చిత్ర బృందం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలిసింది....

The Kerala Story:సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిసిన కేరళ స్టోరీ టీమ్
The Kerala Story Team Meets CM Yogi Adityanath

లక్నో : ది కేరళ స్టోరీ చిత్ర బృందం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలిసింది. కేరళ స్టోరీ (The Kerala Story)చిత్రానికి పన్ను రాయితీ ప్రకటించినందుకు చిత్ర బృందం సీఎం యోగిని కలిసింది.(Meets CM Yogi Adityanath) యూపీ సర్కారు మత మార్పిడి నిరోధక చట్టాన్ని అమలు చేస్తున్నందుకు సీఎం యోగిని చిత్ర బృందం అభినందించింది. కేరళ స్టోరీ చిత్ర నిర్మాత విపుల్ షా, ప్రధాన నటి అదా శర్మ,దర్శకుడు సుదీప్తో సేన్‌తో(producer Vipul Shah, lead actor Adah Sharma and director Sudipto Sen) సహా ది కేరళ స్టోరీ తారాగణం, సాంకేతిక సిబ్బంది యోగి ఆదిత్యనాథ్‌తో సినిమా గురించి చర్చించి, సినిమా చూడాల్సిందిగా అభ్యర్థించారు.

ఇది కూడా చదవండి : Viral Video: ఢిల్లీ మెట్రోరైలులో దంపతుల ముద్దూ ముచ్చట్లు...వీడియో వైరల్

కేరళ స్టోరీ కేరళలోని హిందూ యువతులను మతం మార్చడం, ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) వారి రిక్రూట్‌మెంట్ చుట్టూ తిరుగుతుంది. మే 5వతేదీన విడుదలైన ఈ చిత్రం మేకర్స్ ద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించడంతో రాజకీయ తుపానుకు తెరలేచింది.ముఖ్యమంత్రితో సంభాషించిన సందర్భంగా సినిమా బృందం లవ్ జిహాద్ ను అరికట్టడానికి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించింది.శుక్రవారం లోక్‌భవన్‌లో జరిగే కేరళ స్టోరీ చిత్రం ప్రత్యేక ప్రదర్శనకు సీఎం ఆదిత్యనాథ్, ఆయన మంత్రివర్గ సహచరులు హాజరుకానున్నారు.

Updated Date - 2023-05-11T13:32:00+05:30 IST