Tomato: గత నెలలో కిలో రూ.120... ప్రస్తుతం రూ.8

ABN , First Publish Date - 2023-09-07T09:59:29+05:30 IST

టమోటా కిలో రూ.8 కొనుగోలుకు వ్యాపారులు సిద్ధం కావడంతో, చేసేదిలేక రైతులు టమోటా(Tomato)లను తమ పశువులకు

Tomato: గత నెలలో కిలో రూ.120... ప్రస్తుతం రూ.8

- ఆవేదనలో టమోటా రైతు

పెరంబూర్‌(చెన్నై): టమోటా కిలో రూ.8 కొనుగోలుకు వ్యాపారులు సిద్ధం కావడంతో, చేసేదిలేక రైతులు టమోటా(Tomato)లను తమ పశువులకు మేత గా వినియోగిస్తున్నారు. దిండుగల్‌(Dindugal) జిల్లా ఒట్టాన్‌సత్రం, పళని చుట్టుపక్కల గ్రామాల్లో వేలాది ఎకరాల్లో రైతులు టమోటా సాగు చేస్తున్నారు. పళనిలో టమోటా మార్కెట్‌ రాష్ట్రంలోనే పేరుగాంచింది. గత నెల వర్షాల కారణంగా దిగుబడులు తగ్గి కిలో టమోటా రూ.100 నుంచి రూ.120 వరకు విక్రయమైంది. ఈ నెలలో వర్షాలు తగ్గడంతో టమోటా దిగుబడులు అధికం కావడంతో వాటి ధరలకు కూడా గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం 14 కిలోల పెట్టె రూ.130కి మాత్రమే పలుకుతోంది. మొదటి రకం టమోటాకు ఈ ధర కాగా, రెండవ రకం కొనుగోలుకు వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. ఈ ధరకు విక్రయిస్తే రవాణా ఖర్చులు కూడా రావని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు, టమోటాలను తమ పశువులకు మేతగా వేస్తున్నారు.

nani6.jpg

Updated Date - 2023-09-07T09:59:31+05:30 IST