Share News

MP Dhiraj Sahu: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఎవరు? 200 కోట్ల స్కామ్‌తో ఆయనకు లింకేంటి?

ABN , First Publish Date - 2023-12-09T15:48:25+05:30 IST

ఇటీవల ఒడిశా, జార్ఖండ్‌ రాష్ట్రాల్లోని డిస్టిలరీ గ్రూప్, దాని అనుబంధ సంస్థలపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ దాడులు నిర్వహించగా.. కళ్లుచెదిరే నోట్ల గుట్టలు బయటపడ్డాయి. ఇప్పటిదాకా రూ.290 కోట్లకు పైగా డబ్బు పట్టుబడిందని..

MP Dhiraj Sahu: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఎవరు? 200 కోట్ల స్కామ్‌తో ఆయనకు లింకేంటి?

Congress MP Dhiraj Sahu Case: ఇటీవల ఒడిశా, జార్ఖండ్‌ రాష్ట్రాల్లోని డిస్టిలరీ గ్రూప్, దాని అనుబంధ సంస్థలపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ దాడులు నిర్వహించగా.. కళ్లుచెదిరే నోట్ల గుట్టలు బయటపడ్డాయి. ఇప్పటిదాకా రూ.290 కోట్లకు పైగా డబ్బు పట్టుబడిందని, ఇంకా లెక్కింపులు కొనసాగుతున్నాయని తేలింది. జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహు ఈ కేసుతో ముడిపడి ఉండటంతో.. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇంతకీ ఈ ధీరజ్ సాహు ఎవరు? ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అని చర్చించుకుంటున్నారు. మరి.. ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి.

ధీరజ్ సాహు ఎవరు?

ధీరజ్ సాహు ఒక ప్రముఖ వ్యాపారవేత్త. ఆయన కుటుంబం చాలాకాలంగా కాంగ్రెస్‌తో అనుబంధం కలిగి ఉంది. 2010 నుంచి జార్ఖండ్ నుంచి ధీరజ్ రాజ్యసభకు కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు. ఆయన కుటుంబం పలు వ్యాపారాలను నిర్వహిస్తోంది. తాజాగా ఐటీ శాఖ దాడులు నిర్వహించిన డిస్టిలర్ గ్రూప్, దాని అనుబంధ సంస్థల్లోనూ ధీరజ్ కుటుంబ సభ్యులకు లింక్ ఉందని తేలింది. బౌద్ డిస్టిలరీస్‌లో గ్రూప్ కంపెనీ అయిన బల్దేవ్ సాహు ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ కాంగ్రెస్ ఎంపీతో లింక్ చేయబడింది. ఈ విధంగా 290 కోట్ల నల్లధనం స్కామ్‌లో ధీరజ్ పేరు వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ సహా ఇతర బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై విమర్శల వర్షం కురిపించడం మొదలుపెట్టారు.


‘‘దేశప్రజలు ఈ నోట్ల కుప్పను చూసి.. కాంగ్రెస్ నాయకుల ‘నిజాయితీ’తో కూడిన ప్రసంగాలు వినాలి. ప్రజల నుండి ఏది దోచుకున్నా.. ప్రతి పైసా తిరిగి ఇవ్వాలి. ఇది మోదీ హామీ’’ అని ప్రధాని మోదీ తన ట్వీట్‌లో కాంగ్రెస్‌ని టార్గెట్ చేశారు. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ధ్వజమెత్తుతూ.. గతంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నోట్ల రద్దుకు వ్యతిరేకంగా మాట్లాడడానికి ఇదే కారణమని విమర్శించారు. ‘‘డబ్బులు ఇంకా లెక్క పెడుతుండగానే కౌంటింగ్ మెషీన్లు చెడిపోయాయి. అధికారులు అలసిపోయారు. ఆ నగదును భర్తీ చేసేందుకు బ్యాగుల కొరత కూడా ఏర్పడింది. డబ్బులు కుప్పలు తెప్పలుగా బయటపడుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ అవినీతికి మారుపేరు అనడానికి ఇదే ఉదాహరణ’’ అని ఆరోపించారు.

అటు.. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సైతం ఇంత నల్లధనం ఎక్కడి నుంచి వచ్చిందో? కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ వద్ద ఉన్న ఈ డబ్బు ఎవరిదో చెప్పాలని కాంగ్రెస్ పార్టీని నిలదీశారు. ‘‘మొహబత్‌కీ దుకాన్‌లో ఈ అవినీతి ఎలా జరుగుతోంది?’’ అని ప్రశ్నించారు. మరోవైపు.. అవినీతిని అరికట్టడంలో జార్ఖండ్ సీఎం హేమంత సోరెన్ విఫలమయ్యారని విమర్శిస్తూ, ఆయన సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా డిమాండ్ చేశారు. మరి.. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2023-12-09T15:48:27+05:30 IST