Diabetics: షుగర్‌ సమస్య ఉన్నవాళ్లు హాట్ వాటర్ బాటిల్స్ ఎందుకు వాడకూడదంటే..

ABN , First Publish Date - 2023-02-23T12:07:43+05:30 IST

మధుమేహం అనేది చాలా కాంప్లికేషన్స్‌తో కూడిన వ్యాధి. చాలా మందికి ఈ వ్యాధి ఉన్నట్టు కూడా టెస్ట్ చేసే వరకూ తెలియదు. దీర్ఘకాలిక మధుమేహం (టైప్ 1 లేదా టైప్ 2 డయాబెటిస్) మీ నరాలను ఎఫెక్ట్ చేయడం ప్రారంభించినట్లయితే.. ముందుగా శరీరంలో మార్పులను గమనించవచ్చు.

Diabetics: షుగర్‌ సమస్య ఉన్నవాళ్లు హాట్ వాటర్ బాటిల్స్ ఎందుకు వాడకూడదంటే..

Diabetics: మధుమేహం అనేది చాలా కాంప్లికేషన్స్‌తో కూడిన వ్యాధి. చాలా మందికి ఈ వ్యాధి ఉన్నట్టు కూడా టెస్ట్ చేసే వరకూ తెలియదు. దీర్ఘకాలిక మధుమేహం (టైప్ 1 లేదా టైప్ 2 డయాబెటిస్) మీ నరాలను ఎఫెక్ట్ చేయడం ప్రారంభించినట్లయితే.. ముందుగా శరీరంలో మార్పులను గమనించవచ్చు. వేడి లేదా చల్లని ఉష్ణోగ్రతలకు సంబంధించిన సెన్సేషన్ శరీరానికి పెద్దగా ఉండదు. అటువంటి పరిస్థితులలో.. హాట్ వాటర్ బాటిల్స్ లేదా హీటెడ్ బ్లాంకెట్స్‌ను ఉపయోగించడం వలన కాలిన గాయాలు ఏర్పడవచ్చు. ఇది చాలా ఇబ్బందికరంగా పరిణమించవచ్చు.

మధుమేహ వ్యాధిగ్రస్తులు.. ప్రత్యేకించి వారికి న్యూరోపతి సమస్యలు ఉన్నట్లయితే.. నడిచే సమయంలో అది ఇంటి లోపల అయినా కావొచ్చు లేదంటే బయటకు వెళ్లినప్పుడు అయినా కావొచ్చు.. వారి కాలి వేళ్లను కవర్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు సంబంధించిన అత్యంత సాధారణ సమస్యలు సున్నితత్వం, నొప్పి ఫీలవకపోవడం, అతి చిన్న గాయం, దద్దుర్లు లేదా అలెర్జీలు కూడా గ్యాంగ్రీన్‌గా మారవచ్చు. ఒకవేళ అలా మారితే మాత్రం కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పట్టవచ్చు లేదంటే శస్త్ర చికిత్స చేయాల్సి రావొచ్చు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగడం వల్ల కండరాలు క్రమంగా బలహీనపడతాయి.

డయాబెటిస్‌కు సంబంధించిన కాంప్లికేషన్స్‌ను నివారించడానికి, మీ షుగర్‌ను నియంత్రణలో ఉంచుకోవడంతో పాటు, బీపీ, కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉండేలా చూసుకోండి. ధూమపానం అనేది మధుమేహం-సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి మీకు మధుమేహం ఉన్నప్పుడు ధూమపానం అస్సలు మంచిది కాదు. మధుమేహంతో బాధపడుతున్న వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజూ మీ చేతులు, కాళ్ళను గోరువెచ్చని నీటితో కడుక్కుంటూ ఉండాలి. ఆరిపోయిన అనంతరం రోజుకు రెండు సార్లు మాయిశ్చరైజర్‌ని రాస్తూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. శరీరంపై రాషెస్ ఏమైనా వస్తున్నాయోమోనని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. మొత్తానికి తరువాత ఎప్పుడైనా హాట్ వాటర్ బాటిల్ లేదంటే హీటెడ్ బ్లాంకెట్‌ను వాడాలంటే షుగర్ పేషెంట్స్ ఒక్కసారి ఆలోచించండి.

Updated Date - 2023-02-23T12:07:44+05:30 IST