Share News

NRIs: బహ్రెయిన్‌ నుంచి వచ్చి ఓటేసిన బీఆర్‌ఎస్‌ ఎన్నారైలు

ABN , First Publish Date - 2023-12-01T06:36:22+05:30 IST

Telangana Polls: తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఓటు ద్వారా మద్దతు తెలియజేయడానికి బీఆర్‌ఎస్‌ ఎన్నారై నాయకులు దేశ, విదేశాల నుంచి వచ్చి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

NRIs: బహ్రెయిన్‌ నుంచి వచ్చి ఓటేసిన బీఆర్‌ఎస్‌ ఎన్నారైలు

Telangana Polls: తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఓటు ద్వారా మద్దతు తెలియజేయడానికి బీఆర్‌ఎస్‌ ఎన్నారై నాయకులు దేశ, విదేశాల నుంచి వచ్చి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్నారై బీఆర్ఎస్‌ బహ్రెయిన్ (BRS Bahrain) శాఖ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ గురువారం జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలం సిరికొండ గ్రామంలో కుటుంబ సభ్యులతో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల భవిష్యత్‌ కోసం ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి, సమాజం పురోగతి సాధించాలంటే ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడే నాయకులకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఒక వ్యవస్థకు ప్రజా ప్రతినిధి ఎంత అవసరమో, ఆ ప్రజా ప్రతినిధిని ఎన్నుకునేందుకు ఓటు అంతే అవసరమని పేర్కొన్నారు. ఓటు హక్కును వినియోగించుకుందుకు గల్ఫ్ ఎడారి బహ్రెయిన్ నుంచి తెలంగాణకు వచ్చానని ఆయన వెల్లడించారు.

Updated Date - 2023-12-01T06:38:00+05:30 IST