Indian Student: ఫిలిప్పీన్స్‌లో విమాన ప్రమాదం.. ట్రైనీ భారతీయ పైలట్‌ సహా మరోకరు దుర్మరణం!

ABN , First Publish Date - 2023-08-04T11:23:19+05:30 IST

ఫిలిప్పీన్స్‌ (Philippines) లో తాజాగా ఒక చిన్న విమానం ప్రమాదం బారిన పడింది. ఈ దుర్ఘటనలో భారత్‌కు చెందిన ట్రైనీ పైలట్‌తో సహా ఫిలిప్పీన్స్‌కు చెందిన ట్రైనర్ చనిపోయారు.

Indian Student: ఫిలిప్పీన్స్‌లో విమాన ప్రమాదం.. ట్రైనీ భారతీయ పైలట్‌ సహా మరోకరు దుర్మరణం!

మనీలా: ఫిలిప్పీన్స్‌ (Philippines) లో తాజాగా ఒక చిన్న విమానం ప్రమాదం బారిన పడింది. ఈ దుర్ఘటనలో భారత్‌కు చెందిన ట్రైనీ పైలట్‌తో సహా ఫిలిప్పీన్స్‌కు చెందిన ట్రైనర్ చనిపోయారు. మృతులు భారతీయ విద్యార్థి పైలట్ అన్షుమ్ రాజ్‌కుమార్ కొండే (Anshum Rajkumar Konde), ఫిలిపినో ట్రైనర్ ఎడ్జెల్ జాన్ లుంబావో టబుజో (Edzel John Lumbao Tabuzo) ఈ విమానం ఆగస్టు 2న మధ్యాహ్నం 12:16 గంటల ప్రాంతంలో లావోగ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం (Laoag International Airport) నుంచి బయలుదేరింది. మధ్యాహ్నం 3:16 గంటలకు తుగుయేగరావో ఎయిర్‌పోర్ట్‌ (Tuguegarao Airport) లో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే, విమానం తుగుయేగరావో విమానాశ్రయానికి సమయానికి చేరకపోవడంతో అధికారులు దానికోసం అన్వేషించారు.

వారి అన్వేషణలో బుధవారం మధ్యాహ్నం అపాయో ప్రావిన్స్ (Apayao Province) లో విమానం శిథిలాలను గుర్తించడం జరిగింది. విమానంలో ఉన్న ఇద్దరు వ్యక్తులూ మృతి చెందారు. కాగా, విమానం ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. అధికారులు ఈ ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గురైన విమానం ఒక ఎకో ఎయిర్ సెస్నా 152 అని, ఇది ఒక చిన్న టూ-సీటర్ విమానం అని తెలిసింది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను ప్రతికూల వాతావరణం కారణంగా ఇంకా వెలికితీయలేదు. ఇక అన్షుమ్‌ రాజ్‌కుమార్‌ కొండే ఒక పైలెట్ స్టూడెంట్ కావడంతో అతని మరణం కారణంగా సదరు స్కూల్ ఆపరేషన్స్ నిలిపివేశారు. ఈ విమానం ప్రమాదానికి (Plane Accident) గల కారణమేంటో తెలిసేవరకు ఆ స్కూల్ సేవలు కొనసాగడానికి వీల్లేదని ప్రభుత్వాధికారులు ఆదేశించారు.

Schengen visa for Indians: భారతీయులకు స్కెంజెన్ వీసాల నిలిపివేత.. స్విట్జర్లాండ్ ఎంబసీ ఏం చెప్పిందంటే..


Updated Date - 2023-08-04T11:23:19+05:30 IST