Real Estate: స్వదేశంలో పెట్టుబడులకు ఎన్నారైల ఆసక్తి.. ఆ రెండు నగరాలే మనోళ్ల టార్గెట్.. సర్వేలో బయటపడిన ఆసక్తికర విషయాలు..
ABN , First Publish Date - 2023-06-14T10:20:25+05:30 IST
కరోనా కారణంగా దాదాపు అన్ని రంగాలు కుదేలు అయ్యాయి. గడిచిన ఏడాది కాలంగా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే తిరిగి అన్ని రంగాలు కోలుకుంటున్నాయి.
ఎన్నారై డెస్క్: కరోనా కారణంగా దాదాపు అన్ని రంగాలు కుదేలు అయ్యాయి. గడిచిన ఏడాది కాలంగా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే తిరిగి అన్ని రంగాలు కోలుకుంటున్నాయి. ఇక రియల్ ఎస్టేట్ (Real Estate) కూడా ఇప్పటికే గాడిలో పడింది. గత కొన్ని నెలలుగా స్థిరాస్థి రంగం మందగించినప్పటికీ ప్రస్తుత పరిస్థితులు మళ్లీ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. దాంతో ఇతర దేశాల్లో స్థిరపడిన ఎన్నారైలు (Non-Resident Indian) స్వదేశంలో స్టాక్స్, బంగారం, మ్యూచవల్ ఫండ్స్‌లోనూ పెట్టుబడులు పెడుతున్నారు. కానీ, ఎక్కువ మంది మాత్రం రియల్ ఎస్టేట్ వైపే చూస్తున్నారు. ఇక ఎన్నారై పెట్టుబడులను (NRI Investments) సులభతరం చేయడానికి, భారత ఆర్థిక వ్యవస్థలో వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం వివిధ విధానాలు, నిబంధనలను అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎన్నారై పెట్టుబడిదారులు (NRI Investors) ఇండియాలోని కమర్షియల్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లోనూ భారీగా పెట్టుబడులు పెడుతున్నట్టు ఎస్‌బీఎన్నారై (SBNRI) నివేదిక వెల్లడించింది. ఇలా ఎన్నారైల నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్ పెరుగుతున్న వేళ భారతీయ రియల్ ఎస్టేట్ రంగం 2023-2028 మధ్యకాలంలో 9.2 శాతం సీఏజీఆర్ వృద్ధిని నమోదు చేస్తుందని ఈ నివేదిక అంచనా వేసింది.
ఇక 52 శాతం మంది ఎన్నారైలు (NRI) భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లలో తమ పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు కమర్షియల్ రియల్ ఎస్టేట్ (Commercial Real Estate)లో పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నారని ఈ సర్వే రిపోర్ట్ తెలియజేసింది. సింగపూర్, యూకే ఆధారిత ప్రతి ఎన్నారైలలో 35శాతం మంది కష్టపడి సంపాదించిన డబ్బును భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడుతున్నారని మరో ఎస్‌బీఎన్నారై సర్వే హైలైట్ చేసింది. అయితే, అమెరికాలో ఉండే 65శాతం ఎన్నారైలు భారతదేశంలో పెట్టుబడి పెట్టడంతో పాటు ఇంటికి డబ్బు పంపడం రెండింటినీ ఇష్టపడుతున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా కొలియర్స్ ఇండియా సీఎండీ సంకీ ప్రసాద్ (Sankey Prasad) మాట్లాడుతూ, ఇండియాలో ఆర్ధిక వృద్ధి, ఆదాయాలు పెరగడం, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించడం వల్ల ఈ సానుకూల పరిస్ధితులు చోటు చేసుకున్నాయని తెలిపారు.
Saudi Arabia: ఆ వీసాదారులకు సౌదీ అరేబియా తీపి కబురు.. అలా చేస్తే సౌదీలో ఎంట్రీ చాలా ఈజీ..!
ఇక రాబోయే రోజుల్లో అభివృద్ధి అంచనాతో పాటు బంధాలను కాపాడుకోవడానికి ఎన్నారైలు ద్వితీయ శ్రేణి నగరాలనే (Tier-II Cities) పెట్టుబడులకు ఎంచుకుంటున్నారని సర్వేలో తేలింది. ఈ విషయంలో దేశంలోని చండీగఢ్, కోయంబత్తూర్ వంటి నగరాలు ఎన్నారైల పెట్టబడుల విషయంలో ముందంజలో ఉన్నాయని నివేదిక తెలిపింది. ఉన్నతమైన జీవన ప్రమాణాలు, తయారీ రంగం, ఐటీ హబ్‌గా ఎదుగుతున్న నేపథ్యంలో కోయంబత్తూరుపై ఎన్నారైలు (NRIs) దృష్టిసారిస్తున్నారట. ఇక ప్రణాళికాబద్ధమైన పట్టణ అభివృద్ధి, ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన, కాస్మోపాలిటన్ జీవనశైలి, విద్య, వైద్య సదుపాయాల నేపథ్యంలో చండీగఢ్ నగరం ప్రవాస భారతీయులను విపరీతంగా ఆకర్షిస్తోంది.