Telugu Films: కువైత్‌లో తెలుగు సినిమాల నిర్మాణానికి ప్రోత్సాహం

ABN , First Publish Date - 2023-06-17T12:47:46+05:30 IST

కువైత్‌లో సినిమాలు నిర్మిణచాలనుకునే ఔత్సిహికులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో యునైటెడ్ తెలుగు ఫోరమ్, తెలుగు అరబ్స్ సంయుక్తంగా మొదటి 2022-23 లఘు చిత్రాల పోటీ కార్యక్రమం నిర్వహించాయి.

Telugu Films: కువైత్‌లో తెలుగు సినిమాల నిర్మాణానికి ప్రోత్సాహం

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: కువైత్‌లో సినిమాలు నిర్మిణచాలనుకునే ఔత్సిహికులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో యునైటెడ్ తెలుగు ఫోరమ్, తెలుగు అరబ్స్ సంయుక్తంగా మొదటి 2022-23 లఘు చిత్రాల పోటీ కార్యక్రమం నిర్వహించాయి. ఈ పోటీలలో పాల్గొన్న దర్శకులందర్నీ వెంకట్ కోడూరి ప్రత్యేక జ్ఞాపికతో సత్కరించారు.

TT.jpg

ఈ సందర్భంగా UTF అధ్యక్షులు వెంకట్ కోడూరి మాట్లాడుతూ, సినిమా రంగం కేవలం సృజనాత్మక, వినోద రంగాలలోనే కాకుండా సమాజాన్ని ప్రభావితం చేసే ఎన్నో సినిమాలు తీసుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయటానికి కృషి చేసిన మున్నా సయ్యద్, రాజి ఖాన్, షరీఫ్, రాము, ముజీర్, ఉదయ్‌లకు ప్రత్యేకంగా ధన్యవాధములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గిరి ప్రసాద్, విజయ భాస్కర్, జిలకర మురళి, మల్లి మారోతు, ముస్తాక్ ఖాన్, అర్షద్, ఇమ్రాన్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

TTT.jpg

ఉత్తమ ఎడిటర్: నాని (ఇదీ కథ)

ఉత్తమ ఫోటోగ్రఫీ: సుబ్బు (పసి ప్రాణం)

ఉత్తమ భావవ్యక్తీకరణ: మాస్ మస్తాన్ ( బ్లైండ్ మైండ్ )

ఉత్తమ కథ: భువనేశ్వరి (పసి ప్రాణం)

ఉత్తమ హీరోయిన్: సంజు (శ్రీ)

హీరోయిన్ ప్రత్యేక ప్రస్తావన: రాణి (పసి ప్రాణం)

ఉత్తమ హీరో: హైదర్ (మనీ)

ఉత్తమ దర్శకులు: సుభాన్ (ఇదీ కథ)

ఉత్తమ చిత్రం: మల్లిఖార్జున (పసి ప్రాణం)

TTTT.jpg

Updated Date - 2023-06-17T12:47:46+05:30 IST