Saudia Airlines: ఆ ఏడు గమ్యస్థానాలకు వెళ్లేవారికి బంపరాఫర్.. ఏకంగా 60శాతం డిస్కౌంట్‌తో విమాన టికెట్లు..!

ABN , First Publish Date - 2023-05-06T11:05:56+05:30 IST

సౌదీ అరేబియా జాతీయ విమానయాన సంస్థ సౌదీయా ఎయిర్‌లైన్స్ (Saudia Airlines) బంపర్ ఆఫర్ ప్రకటించింది.

Saudia Airlines: ఆ ఏడు గమ్యస్థానాలకు వెళ్లేవారికి బంపరాఫర్.. ఏకంగా 60శాతం డిస్కౌంట్‌తో విమాన టికెట్లు..!

రియాద్: సౌదీ అరేబియా జాతీయ విమానయాన సంస్థ సౌదీయా ఎయిర్‌లైన్స్ (Saudia Airlines) బంపర్ ఆఫర్ ప్రకటించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) సహా ఏడు గమ్యస్థానాలకు వెళ్లే ప్రయాణికులకు ఏకంగా 60శాతం డిస్కౌంట్‌తో విమాన టికెట్లు ఇస్తామని తెలిపింది. 48 గంటల పాటు ఈ భారీ డిస్కౌంట్ ధరలకు (Big Discount Prices) విమాన టికెట్లు అందుబాటులో ఉంటాయని ట్విటర్ ద్వారా ఎయిర్‌లైన్ అధికారులు శుక్రవారం వెల్లడించారు. అయితే, ఈ ఆఫర్ కేవలం మే 5, 6 తేదీల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఈ రెండు రోజుల్లోనే టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలాగే ఇలా ఈ ఆఫర్‌లో కొన్నా టికెట్లతో ఈ ఏడాది మే 10వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ లోపు మాత్రమే జర్నీ చేసే వెసులుబాటు ఉంటుంది. సౌదీయా ఎయిర్‌లైన్స్ పేర్కొన్నట్లు ఏడు గమ్యస్థానాలలో ఎక్కడికైనా వెళ్లొచ్చు. ఇక ఈ ఏడు డేస్టినేషన్స్ లిస్ట్‌లో యూఏఈతో పాటు అబుదాబి, కువైత్, దోహా, మస్కట్, మాడ్రిడ్, మారిషస్, మాల్దీవులు, గ్వాంగ్జౌ ఉన్నాయి. ఆసక్తి గలవారు saudia.comలో తమ సీట్లను రిజర్వ్ చేసుకోవచ్చు.

Saudi Arabia: భారత్ సహా ఏడు దేశాల పాస్‌పోర్టుల విషయంలో సౌదీ సంచలన నిర్ణయం..!


Updated Date - 2023-05-06T11:09:04+05:30 IST