Kuwait: కువైత్‌లో చిక్కుకున్న భారత కార్మికులు.. ఎట్టకేలకు స్వదేశానికి..

ABN , First Publish Date - 2023-09-10T08:29:31+05:30 IST

కువైత్‌లో చిక్కుకుపోయిన ఇరవై మంది భారతీయ కార్మికులు (Indian Workers) అక్కడి భారత ఎంబసీ సహాయంతో తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. ఈ కార్మికులు కువైత్‌ (Kuwait) లోని ఒక కంపెనీలో క్లీనింగ్ వర్కర్స్‌గా తక్కువ వేతనంతో పాటు ఆహారం లేకుండా పనిచేశారు.

Kuwait: కువైత్‌లో చిక్కుకున్న భారత కార్మికులు.. ఎట్టకేలకు స్వదేశానికి..

కువైత్ సిటీ: కువైత్‌లో చిక్కుకుపోయిన ఇరవై మంది భారతీయ కార్మికులు (Indian Workers) అక్కడి భారత ఎంబసీ సహాయంతో తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. ఈ కార్మికులు కువైత్‌ (Kuwait) లోని ఒక కంపెనీలో క్లీనింగ్ వర్కర్స్‌గా తక్కువ వేతనంతో పాటు ఆహారం లేకుండా పనిచేశారు. వారు కువైత్‌కు రాకముందు భారత్‌లోని రిక్రూట్‌మెంట్ ఏజెంట్లకు సర్వీస్ ఫీజుల కింద భారీగా చెల్లించడం జరిగింది. అయితే, ఒక ఏడాది తర్వాత వారి రెసిడెన్సీ రెన్యువల్ కోసం 475 కువైటీ దినార్లు (రూ. 1.28లక్షలు) చెల్లించమని వారిని కంపెనీ అడగడంతో వారు ఆశ్చర్యపోయారు. అప్పటికే వారు తమ ఆహారం, ఇతర ఖర్చుల కోసం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు.

ఈ క్రమంలో రెసిడెన్సీని రద్దు చేసి, వారిని వెనక్కి పంపి, వారి పాస్‌పోర్టులను నిలిపివేయాలన్న వారి అభ్యర్థనను కూడా కంపెనీ రిజెక్ట్ చేసింది. అలాగే కంపెనీ ఈ కార్మికులకు వారి జీతాలను చెల్లించడం కూడా నిలిపివేసింది. పైగా వారి వసతి గృహాలలో నీటి, విద్యుత్ సరఫరాలను కూడా కట్ చేసింది. ఆ సమయంలో వారికి తోటి భారత ప్రవాసులు మద్దతుగా నిలిచారు. అలాగే సామాజిక కార్యకర్తలు కార్మికుల దుస్థితిని భారత ఎంబసీ (Indian Embassy) దృష్టికి తీసుకెళ్లారు. భారత అంబాసిడర్ హెచ్ఈ డా. ఆదర్శ్ స్వైకా సూచన మేరకు ఎంబసీ అధికారులు వెంటనే కార్మికుల వద్దకు వెళ్లి వారితో చర్చించారు.

భారత రాయబార కార్యాలయం చొరవతో కంపెనీ చివరికి కార్మికులందరికీ విమాన టిక్కెట్స్‌ (Flight Tickets) ను అందించింది. దీంతో కార్మికులు స్వదేశానికి పయనమయ్యారు. చెన్నై విమానాశ్రయాని (Chennai Airport) కి చేరుకున్న తర్వాత తమకు సహకరించిన కువైత్‌లోని భారత ఎంబసీ, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, సామాజిక కార్యకర్తలు మతి, జీ రాజాలతో పాటు కువైత్‌లోని కమ్యూనిటీ సభ్యులకు వారు ధన్యవాదాలు తెలిపారు.

Indian expat: విజిట్ వీసాపై యూఏఈ వెళ్లిన భారత వ్యక్తి.. ఊహించని విధంగా నెలల తరబడి అక్కడే చిక్కుకుపోయాడు.. చివరికి


Updated Date - 2023-09-10T08:29:31+05:30 IST