Share News

Chandrababu Case : చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్‌.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకు జగన్ సర్కార్.. ఏం తేలుతుందో..!?

ABN , First Publish Date - 2023-11-21T18:01:08+05:30 IST

Jagan Govt Challanges HC Order In Supreme Court : టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబుకు (Chandrababu) స్కిల్ కేసులో ఏపీ హైకోర్టు (AP High Court) రెగ్యులర్ బెయిల్ (Regular Bail) ఇవ్వడాన్ని జగన్ సర్కార్ (Jagan Govt) వ్యతిరేకిస్తోంది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో (Supreme Court) రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది.

Chandrababu Case : చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్‌.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకు జగన్ సర్కార్.. ఏం తేలుతుందో..!?

టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబుకు (Chandrababu) స్కిల్ కేసులో ఏపీ హైకోర్టు (AP High Court) రెగ్యులర్ బెయిల్ (Regular Bail) ఇవ్వడాన్ని జగన్ సర్కార్ (Jagan Govt) వ్యతిరేకిస్తోంది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో (Supreme Court) రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. ఈ మేరకు దేశ అత్యున్న న్యాయస్థానంలో అడిషినల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి (Ponnavolu Sudhakar Reddy) పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును ప్రభుత్వం కోరింది. దర్యాప్తు దశలోనే కేసులో సాక్షాలు లేవని చెప్పడం హైకోర్టు తన పరిధిని అతిక్రమించడమేనని పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాదు.. హైకోర్టు ఇచ్చిన తీర్పును తక్షణమే నిలిపివేయాలని సుప్రీంను ప్రభుత్వం కోరింది.


supre-chandrababu.jpg

ఇది అసాధారణం!

పిటిషన్ వేసిన అనంతరం పొన్నవోలు (Ponnavolu) మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ హైకోర్టు తీర్పు న్యాయ సమ్మతంగా లేదన్నారు. స్కిల్ స్కాం కుంభకోణంలో దర్యాప్తు ఇంకా కొనసాగుతోందన్నారు. బెయిల్ స్టేజ్‌లోనే సాక్షాలు లేవని ఏపీ హైకోర్టు అనడం సరైనది కాదున్నారు. హైకోర్టు తన పరిధిని అతిక్రమించింది. ఇది అసాధారణమైన విషయం. చార్జిషీట్ వేయనంతవరకు దర్యాప్తు కొనసాగుతున్నట్లే. టీడీపీ అకౌంట్‌లో ఊరు, పేరు లేని నగదు జమయ్యింది. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. ఈడీ (Directorate of Enforcement) కూడా ఈ కేసులో దర్యాప్తు చేస్తోంది. సిమెన్స్ అంతర్గత నివేదికలు, ఫోరెన్సిక్ ఆడిట్‌లో అక్రమాలు బయటపడ్డాయి. ఏపీ హైకోర్టు ఈ కేసులో మినీ ట్రయల్ జరిపింది. మినీ ట్రైలర్‌ను నిర్వహించడం చట్ట విరుద్ధం. ఇది సామాజిక ఆర్థిక కుంభకోణం. 371 కోట్ల రూపాయల ప్రజల సొమ్మును దోచేశారుఅని పొన్నవోలు చెప్పుకొచ్చారు.

supreme.jpg

అవును.. మాకు హక్కుంది!

ఆరోగ్య కారణాల రీత్యా బెయిల్ ఇవ్వాలనుకుంటే జైల్లో 73 ఏళ్లు దాటిన వారందరి కోసం సీఆర్పీసీ చట్టం సవరిస్తే గొడవే ఉండదు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం కాబట్టి గల్లీ నుంచి ఢిల్లీకి (New Delhi) వచ్చాం. హైకోర్టు న్యాయమూర్తులను తప్పుపట్టడం లేదు.. హైకోర్టు తీర్పును అభ్యంతరం తెలపడం సవాల్ చేసే అధికారం మాకు ఉంది. హైకోర్టు తీర్పు న్యాయ సమ్మతం, చట్ట సమ్మతం కాదు. చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ ఇవ్వడం దురదృష్టకరం. సీఐడీ వాదనను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించాం. ఆధారాలు ఉన్నాయని చెప్పినా హైకోర్టు పట్టించుకోకుండా తీర్పు ఇవ్వడం అప్రజాస్వామికం. ఏపీ స్కిల్ కేసును ఈడీ, సీఐడీ దర్యాప్తు జరుపుతుంది. చార్జిషీట్ వేసినప్పుడు నిజానిజాలు బయటికి వస్తాయిఅని పొన్నవోలు తెలిపారు.Ponnavolu.jpg

ఇలా చేస్తే గొడవే ఉండదుగా!

సాక్షాలు ఆధారాలు ట్రయిల్ కోర్టు వద్ద ఉంటాయి. హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరించింది. సీఐడీ వాదనను పరిగణనలోకి తీసుకోలేదు. ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకునే అధికారం ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకోవచ్చు.. కానీ అధికార దుర్వినియోగం చేయడానికి తన మనుషులకు దోచిపెట్టడానికి ముఖ్యమంత్రిగా అధికారం లేదు. రూ. 371 కోట్ల ప్రభుత్వ సొమ్ము దోచేశారు. సీమెన్స్ నివేదిక, కోనర్ రిపోర్ట్, ఫోరెన్సిక్ నివేదికను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఇది ఆర్ధిక నేరం.. ఐపీసీ నేరం కాదు. ఈ కేసులో కక్ష సాధింపు చర్య లేదని హైకోర్టు స్పష్టం చేసింది. సెక్షన్ 17 ఏ కేసు తీర్పు రిజర్వ్ చేయబడింది.17 ఏ కేసు క్వాష్ పిటిషన్‌లో (Quash Petition) బెయిల్ అంశం ఉందని మేం హైకోర్టుకు చెప్పినా ఆ అంశాన్నీ హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. హైకోర్టు తీర్పులో కనీసం మెన్షన్ చేయలేదు. ఆరోగ్య కారణాల రీత్యా బెయిల్ ఇవ్వాలనుకుంటే జైలులో 73 ఏళ్ళు దాటిన వారందరి కోసం సీఆర్పీసీ చట్టం సవరిస్తే గొడవే ఉండదు. స్కిల్ కేసులో న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం కాబట్టి గల్లీ నుంచి ఢిల్లీ వరకు వచ్చాం అని పొన్నవోలు మీడియాకు వెల్లడించారు. అయితే.. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఏం జరగబోతోంది..? తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందనే దానిపై అటు ప్రభుత్వంలో.. ఇటు టీడీపీలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే.. ఎక్కడైనా న్యాయం, ధర్మమే గెలుస్తుందని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.

skill-Development-Case.jpg

Updated Date - 2023-11-21T18:54:16+05:30 IST