Viral Video: నడుస్తూనే కుప్పకూలిపోయిన యజమాని.. పక్కనే ఉన్న పిల్లులు చేసిందేంటి..? కుక్క రియాక్షన్ ఏంటి..? ఈ వీడియోను చూస్తే..!

ABN, First Publish Date - 2023-06-10T16:04:01+05:30 IST

విశ్వాసాన్ని చూపించడంలో కుక్కలకు మించిన జంతువు మరోటి లేదు అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అన్నం పెట్టిన యజమాని కోసం అవసరమైతే తమ ప్రాణాలను సైతం ఫణంగా పెడుతుంటాయి. అందుకే చాలా మంది ఎన్ని జంతువులను పెంచుకున్నా.. కుక్కల పట్ల మాత్రం ..

విశ్వాసాన్ని చూపించడంలో కుక్కలకు మించిన జంతువు మరోటి లేదు అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అన్నం పెట్టిన యజమాని కోసం అవసరమైతే తమ ప్రాణాలను సైతం ఫణంగా పెడుతుంటాయి. అందుకే చాలా మంది ఎన్ని జంతువులను పెంచుకున్నా.. కుక్కల పట్ల మాత్రం ప్రత్యేకమైన అభిమానం చూపిస్తుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ యజమాని నడుస్తూనే కుప్పకూలిపోతాడు. దీంతో అక్కడే ఉన్న పిల్లలు, కుక్క ఏం చేశాయంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (viral video) తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తాను పెంచుకుంటున్న పిల్లులు, కుక్కకు వింత పరీక్ష పెట్టాడు. వాటిల్లో దేనికి తనపై ప్రేమ ఉందోననే విషయంపై పరీక్ష పెట్టాలని నిర్ణయించుకుంటాడు. ఇందుకోసం ముందుగా ఓ ప్లేట్‌లో కొన్ని గింజలను తీసుకుని పిల్లుల (cats)వద్దకు వెళ్తాడు. వాటి ముందు ఒక్కసారిగా బోల్తాపడిపోయి, చనిపోయినట్లుగా నటిస్తాడు. అక్కడి వచ్చిన పిల్లులు తన యజమాని పరిస్థితి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా.... ఎంచక్కా కింద పడ్డ ఆహార పదార్థాలను తినడం మొదలెడతాయి. ఒక్క గింజను కూడా వదలకుండా మొత్తం తినేస్తాయి. ఆఖరికి తమ యజమాని తల కింద ఉన్న గింజను కూడా లాక్కుని మరీ తింటాయి.

Viral Video: చెవి నొప్పి భరించలేక ఆస్పత్రికి వెళ్లిందో మహిళ.. అక్కడున్న డాక్టర్ రెండే రెండు ఇయర్ డ్రాప్స్‌ను వేయగానే ఊహించని సీన్..!

గింజలు తింటున్న పిల్లులు.. యజమాని కింద పడిపోయాడు అనే విషయాన్ని మాత్రం పట్టించుకోవు. దీంతో అతను ఒక్కసారిగా షాక్ అవుతాడు. తర్వాత కుక్క ముందు కూడా ఇలాగే నటిస్తాడు. కిందపడిపోగానే పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చిన కుక్క.. ఆహార పదార్థాలను పట్టించుకోకుండా తన యజమాని తల వద్ద కూర్చుని దిగాలుగా ఉంటుంది. కాలితో తట్టి మరీ అతన్ని పైకి లేపేందుకు ప్రయత్నిస్తుంది. ఎంత సేపటికీ అతను పైకి లేవకపోవడంతో అక్కడే దిగాలుగా పడుకుని ఆలోచిస్తూ ఉంటుంది. తన పెంపుడు కుక్క చూపించిన ప్రేమకు అతను ఫిదా అయిపోతాడు. కుక్కలు, పిల్లులకు మధ్య తేడా ఇదే.. అని ప్రస్తావిస్తూ ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 11మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పెట్రోల్ బంక్ వద్దకు వచ్చిందో వింత వాహనం.. నివ్వెరపోయి చూస్తున్న జనం.. పడుకునే మంచాన్నే బైకుగా మార్చేశారుగా..!

Updated at - 2023-06-10T16:04:01+05:30