Viral Video: భర్త, పిల్లలకు భోజనం పెట్టేందుకు ఓ భార్య వింత కండీషన్.. ప్రతీ ఇంట్లోనూ ఇలాంటి రూల్‌ను పాటిస్తే..!
ABN , First Publish Date - 2023-05-18T13:55:28+05:30 IST
ప్రస్తుతం మన జీవితాల్లోకి గ్యాడ్జెట్స్ (Gadgets) ఎంతలా ప్రవేశించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Viral Video: ప్రస్తుతం మన జీవితాల్లోకి గ్యాడ్జెట్స్ (Gadgets) ఎంతలా ప్రవేశించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పొద్దున నిద్రలేచిన దగ్గరి నుంచి మళ్లీ రాత్రి నిద్రపోయే వరకు ప్రతిక్షణం ఏదోఒక గ్యాడ్జెట్ మన చేతుల్లో ఉంటోంది. ఇక మొబైల్ ఫోన్ (Mobile Phone) సరేసరి. సో.. వీటి కారణంగా ఒకే ఇంట్లో ఉంటున్న కుటుంబ సభ్యులు కూడా ఒకరినొకరు పలకరించేకునే సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. ఇలా నిరంతరం ఈ గ్యాడ్జెట్స్ మన జీవితాలను శాసిస్తున్నాయి. దాంతో చాలా సందర్భాల్లో కుటుంబ భాందవ్యాలు సైతం దెబ్బతింటున్నాయి. ఇక భోజనం చేసేటప్పుడు కూడా చాలా మంది చేతిలో మొబైల్ లేదంటే వేరే ఏదో గ్యాడ్జెట్తోనే ఉంటున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరిది ఇదే పరిస్థితి. ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ చాలా వరకు ఇవే సన్నివేశాలు దర్శనమిస్తున్నాయి కూడా. అయితే, ఇలాంటి వాటి నుంచి మనల్ని కొంచెం దూరం పెట్టే ఓ సూపర్బ్ ఐడియాతో కూడిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది (Video goes Viral). భర్త, పిల్లలకు భోజనం పెట్టేందుకు ఓ భార్య వింత కండీషన్‌ను ఆప్లై చేయడం మనం వీడియోలో చూడొచ్చు.
ఇంతకీ వీడియోలో ఏముందంటే..
అదో చిన్న కుటుంబం. ఇద్దరు పిల్లలు, భార్యాభర్త. ఇల్లాలు డైనింగ్ టేబుల్‌పై ఆహార పదార్థాలతో రెడీగా ఉంది. ఇక భర్త, ఇద్దరు పిల్లలు భోజనం కోసం క్యూలో నిల్చున్నారు. అలా వారు ఒకరి తర్వాత ఒకరు డైనింగ్ టేబుల్ వద్దకు వస్తున్నారు. వచ్చిరాగానే వారి వద్ద ఉన్న గ్యాడ్జెట్స్‌ను డైనింగ్ టేబుల్‌పై పెట్టేస్తున్నారు. అలా చేసిన తర్వాతే ఆమె వారి చేతికి భోజనం ప్లేటు ఇస్తోంది. ఇలా మొదట బాలుడు తన డిజిటల్ స్లైడ్‌ను టేబుల్ పెట్టి భోజనంతో కూడిన ప్లేటును అందుకున్నాడు. ఆ తర్వాత అమ్మాయి వచ్చింది. ఆమె తన వద్ద ఉన్న ట్యాబ్‌ను మాత్రమే టేబుల్‌పై పెట్టి, భోజనం ప్లేట్ కోసం చేతులు చాస్తుంది. కానీ, తల్లి ఆమెకు భోజనం పెట్టదు. దాంతో తన వద్ద ఉన్న మొబైల్‌ను కూడా తీసి టేబుల్‌పై పెడుతుంది. అప్పుడు తల్లి ఆమె చేతికి భోజనం ప్లేట్ అందిస్తుంది. చివరగా భర్త కూడా క్యూలో వచ్చి తన ల్యాప్‌ట్యాప్‌ను టేబుల్‌పై పెడతాడు. కానీ, భార్య అతనికి భోజనం పెట్టదు. అనంతరం తన ఫోన్‌ను కూడా తీసి టేబుల్‌పై పెట్టిన తర్వాతే అతడికి చేతికి భోజనం ప్లేట్ అందిస్తుంది భార్య. ఈ వీడియో ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ప్రతీ ఇంట్లోనూ ఇలాంటి రూల్ పాటిస్తే బాగుంటుందని కామెంట్ చేస్తున్నారు.