Husband: జాబ్ మానేసి చదువుకుంటున్నా సరే.. మాజీ భార్యకు డబ్బులు పంపాల్సిందే.. కోర్టుకెళ్లిన మాజీ భర్తకు షాకిచ్చిన హైకోర్టు..!

ABN , First Publish Date - 2023-09-21T11:36:37+05:30 IST

విడాకుల తరువాత భార్యకు భర్త భరణం చెల్లించాల్సిందే.. ఓ భర్త మాత్రం నాకు ఉద్యోగం లేదు నేను భరణం చెల్లించలేనంటూ కోర్డు మెట్లెక్కాడు. కానీ..

Husband: జాబ్ మానేసి చదువుకుంటున్నా సరే.. మాజీ భార్యకు డబ్బులు పంపాల్సిందే.. కోర్టుకెళ్లిన మాజీ భర్తకు షాకిచ్చిన హైకోర్టు..!

విడాకుల తరువాత భార్యకు భర్త భరణం చెల్లించాల్సిందే. ఒకవేళ వారికి పిల్లలు పుట్టి, ఆ పిల్లలు భార్యతో ఉంటే భార్య, పిల్లల పోషణకు భర్త భరణం చెల్లించాలి. ఓ వ్యక్తి మాత్రం నేను ప్రస్తుతం ఉద్యోగం చేయడం లేదు, చదువుకుంటున్నాను. నా భార్యకు భరణం ఇవ్వలేను అంటూ కోర్టును ఆశ్రయించాడు. అయితే కోర్టు అతనికి ఊహించని షాకిచ్చింది. మద్రాస్ హైకోర్టులో చోటు చేసుకున్న ఈ కేసు గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

మద్రాస్ హైకోర్టు(Madras High court)లో సెప్టెంబర్ 12న ఓ కేసుకు సంబంధించిన తీర్పు వచ్చింది. ఒక వ్యక్తి తన భార్య నుండి విడాకులు(Divorse) తీసుకున్నాడు. విడాకులు జారీ చేసిన సమయంలో కోర్టు అతని భార్య, కూతురు పోషణార్థం ప్రతినెలా రూ. 12,500 భరణంగా చెల్లించాలని పేర్కొంది. అయితే ఆ భరణం సరిపోవడం లేదని, దాన్ని పెంచాలని కోరుతూ భార్య కోర్టులో అప్పీలు చేసింది. ఈ విషయం మీద భర్త కోర్టును ఆశ్రయించాడు. పిహెచ్డి చేస్తున్న కారణంగా ప్రస్తుతం ఉద్యోగం చేయడం లేదని, కేవలం పార్ట్ టైమ్ జామ్ చేస్తున్నానని అతను తన లాయర్ ద్వారా కోర్టులో వాదనలు వినిపించాడు. తనకు ఫుల్ టైమ్ జాబ్ లేకపోవడం వల్ల భార్య, కూతురుకు అసలు భరణం ఇవ్వలేనని చెప్పుకొచ్చాడు. అయితే అతని అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.

Credit Card: అమల్లోకి కొత్త రూల్.. క్రెడిట్ కార్డులకు ఇప్పటిదాకా ఉన్న ఈ ఫెసిలిటీ.. ఇకపై అస్సలు ఉండదట..!



'ఉద్యోగం ఉందా లేదా అనే కారణంతో సంబంధం లేకుండా భార్య పిల్లలను పోషించాల్సిన బాధ్యత భర్తకు ఉంటుంది. ఇప్పటి జీవన పరిస్థితులను అనుసరించి భార్య, తన మైనర్ కూతురితో కలసి జీవించడానికి రూ. 12,500 చాలా తక్కువ. హాలిడే లేదా ఉద్యోగం నుండి బ్రేక్ తీసుకోవడం వంటి కారణాలతో దీన్ని రద్దు చేయడం జరగదు' అంటూ సదరు భర్త కోర్టులో వేసిన పిటిషన్ ను రద్దు చేస్తున్నట్టు తీర్పు ఇచ్చారు. ఈ కేసును మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తులు ఆర్. సుబ్రమణియన్, ఆర్ కళైమతి బెంచ్ విచారించారు.

Newly Married Couples: పెళ్లి ఫిక్సయిందా..? ఈ 7 సలహాలను పాటిస్తే చాలు.. సంసార జీవితం యమా హ్యాపీ..!


Updated Date - 2023-09-21T11:36:37+05:30 IST