Leafy vegetables: ఆకుకూరలు కొనేముందు..తినేముందు జర ఆలోచించండి..!
ABN , First Publish Date - 2023-03-27T09:37:50+05:30 IST
ఆకు కూరలు(Leafy vegetables) ఆరోగ్యానికి(health) మేలు చేస్తుంటాయని డాక్టర్లు(Doctors) చెబుతుంటారు. ప్రతిరోజూ
ఆకు కూరలు(Leafy vegetables) ఆరోగ్యానికి(health) మేలు చేస్తుంటాయని డాక్టర్లు(Doctors) చెబుతుంటారు. ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలని వైద్యులు సలహాలు ఇస్తుంటారు. ఎక్కడైనా తాజా ఆకుకూరలు కనిపిస్తే చాలు.. ప్రజలు వాటిని కొనుగోలు చేస్తుంటారు. అయితే..ఒక్కొసారి రైతులు ఆకుకూరలు తరలించే క్రమంలో అవి కాస్త వాడిపోతాయి. వాటిని కొనుగోలు చేసేందుకు కస్టమర్లు(customers) ఆసక్తి చూపించరు. కానీ ఓ వ్యక్తి.. అలా వాడిపోయిన ఆకుకూరలను తిరిగి తాజాగా మారుస్తున్నాడు. ఇంతకీ అతను ఏం చేస్తున్నాడంటే.. అలా వాడిపోయిన ఆకుకూరలను కెమికల్లో(Chemical) ముంచి బయటకు తీస్తున్నాడు. అయితే..అప్పటికే వాడిపోయిన ఆకుకూరలు తాజాగా మారిపోతున్నాయి. మనకు కనిపిస్తున్న పాలకూర వాడిపోయి ఉంది. ఆ పాలకూర కట్టను ఓ రసాయనంలో ముంచి తీశాడు. అప్పటి వరకూ వాడిపోయి ఉన్న పాలకూర కెమికల్ లో ముంచగానే ఫ్రెష్ గా మారిపోయింది. దీన్ని చూసిన ప్రజలు షాక్ అవుతున్నారు. ఇన్నాళ్లు మార్కెట్ లో కొనుగోలు చేసిన ఆకుకూరలు..తాజావేనా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.