Viral News: ఇంట్లోని పాత సామాన్లు సర్దుతుంటే దొరికిందో ట్రంకు పెట్టె.. తీరా దాన్ని తెరిచి చూస్తే..!
ABN , First Publish Date - 2023-08-08T12:51:03+05:30 IST
చీలిలో ఇటీవల చోటు చేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. ఓ వ్యక్తి తన ఇంట్లోని పాత సామాన్లను సర్దుతుంటే అతనికి ఒక పెద్ద ట్రంకు పెట్టె దొరికింది. అలా దొరికిన ఆ పెట్టెను ఓపెన్ చేశాడు.. ఇలా అతడు కోటీశ్వరుడు అయిపోయాడు.
Viral News: చీలిలో ఇటీవల చోటు చేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. ఓ వ్యక్తి తన ఇంట్లోని పాత సామాన్లను సర్దుతుంటే అతనికి ఒక పెద్ద ట్రంకు పెట్టె దొరికింది. అలా దొరికిన ఆ పెట్టెను ఓపెన్ చేశాడు.. ఇలా అతడు కోటీశ్వరుడు అయిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. ఎక్సిక్వల్ హినోజోస (Exequiel Hinojosa) తన ఇంట్లోని పాత సామాన్లు సర్దుతున్న క్రమంలో అతనికి తన తండ్రి తాలూకు ఓ పాత ట్రంకు పెట్టి దొరికింది. తీరా దాన్ని తెరిచి చూస్తే అందులో ఓ బ్యాంకు పాస్‌బుక్ (Bank Passbook) కనిపించింది. అందులో 1.4 లక్షలు డిపాజిట్ చేసినట్లు వివరాలు ఉన్నాయి. 1960- 70లో ఎక్సిక్వల్ తండ్రి ఒక ఇంటి కొనుగోలు కోసం ఆ డబ్బును జమ చేశాడు.
అయితే, ఎక్సిక్వల్ తండ్రి చనిపోయి దశాబ్దానికి పైగా గడిచిపోయింది. దీంతో అప్పటి నుంచి ఆ బ్యాంకు పాస్‌బుక్ పాత ట్రంకు పెట్టేలోని చెత్తలో అలాగే ఉండిపోయింది. ఎవరూ దాన్ని పట్టించుకోలేదు. ఇటీవల పాత వస్తువులను సర్దుతున్న క్రమంలో ఎక్సిక్వల్కు ఆ ట్రంకు పెట్టే దానిలో బ్యాంకు ఖాతా తాలూకు పాస్‌బుక్ దొరికింది. కానీ, ఆ బ్యాంకు ఖాతా మూతపడటంతో ఒకసారిగా అతని ఆనందం క్షణాల్లో ఆవిరైంది. అయితే, అదే పాస్‌బుక్‌పై మరో చోట 'స్టేట్ గ్యారెంటీడ్' అని ముద్ర కనిపించింది. ఆ ఖాతాలో డబ్బులు ఎంత జమ చేశారో.. చీలి ప్రభుత్వం దాన్ని తిరిగి ఇస్తుందనే హామీని ఆ ముద్ర ఇస్తుందన్నమాట. దాంతో అతనిలో కొత్త ఆశలు చిగురించాయి.
Viral News: లవర్ భార్యను చంపేందుకు మైండ్‌బ్లాక్ అయ్యే ప్లాన్.. ఓ మహిళ ఏం చేసిందంటే..!
ఈ విషయమై అతడు బ్యాంకు, ప్రభుత్వాధికారులను సంప్రదించాడు. కానీ, ప్రభుత్వ మాత్రం తిరిగి ఆ డబ్బు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో అతడు ప్రభుత్వంపై దావా వేశాడు. తాజాగా కోర్టులో ఎక్సిక్వల్ కేసు విచారణకు వచ్చింది. న్యాయస్థానం అతనికే అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇంకేముంది ఎక్సిక్వల్కు 1.2 మిలియన్ డాలర్లు వచ్చాయి. అంటే భారత కరెన్సీలో అక్షరాల 10 కోట్లు. ఇలా ఎక్సిక్వల్ పాత ట్రంకు పెట్టేలో దొరికిన 60 ఏళ్లనాటి పాత పాస్‌బుక్‌తో రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా (Millionaire Overnight) అవతరించాడన్నమాట.