Viral Video: ఇది జోకా.. మేం పగలబడి నవ్వాలా..? అంటూ ఓ యూట్యూబర్‌పై మండి పడుతున్న నెటిజన్లు.. భార్య సోఫాలో నిద్రపోతోంటే మెల్లగా వచ్చి..

ABN , First Publish Date - 2023-04-20T10:49:06+05:30 IST

పాకిస్తానీ యూట్యూబర్ షావీర్ జాఫ్రీ (Pakistani YouTuber Shahveer Jafry) చేసిన ఓ టిక్‌టాక్ వీడియోపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

Viral Video: ఇది జోకా.. మేం పగలబడి నవ్వాలా..? అంటూ ఓ యూట్యూబర్‌పై మండి పడుతున్న నెటిజన్లు.. భార్య సోఫాలో నిద్రపోతోంటే మెల్లగా వచ్చి..

Viral Video: పాకిస్తానీ యూట్యూబర్ షావీర్ జాఫ్రీ (Pakistani YouTuber Shahveer Jafry) చేసిన ఓ టిక్‌టాక్ వీడియోపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. షావీర్ ఆ వీడియో ద్వారా కామెడీ చేయాలనుకుంటే అది కాస్తా తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇది జోకా.. మేం పగటబడి నవ్వాలా..? అంటూ నెటిజన్లు పాక్ యూట్యూబర్‌పై మండిపడుతున్నారు. ఏ గృహహింస కారణంగానైతే ప్రతియేట దేశంలో వేలాది మంది హత్యగావింపబడుతున్నారో.. దాన్నే ఈ మహానుభావుడు జోక్ చేయాలని చూశాడంటూ కన్నెర్ర చేస్తున్నారు. ఇంతకీ షావీర్ చేసిన ఆ టిక్‌టాక్ వీడియోలో ఏముంది? ఎందుకు నెటిజన్లు అతడిని అంతలా విమర్శిస్తున్నారు? తదితర వివరాల్లోకి వెళ్తే..

షావీర్ జాఫ్రీకి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ (Social media platforms) ద్వారా వీడియోలు చేస్తూ బాగా పాపులర్ అయ్యాడు. ఆ మధ్యలో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను కలిసి, ఆ తర్వాత ఫొటోలకు ఫోజులిచ్చాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, ఇటీవల అతడు భార్యతో కలిసి చేసిన ఓ టిక్‌టాక్ వీడియోనే ఇప్పుడు షావీర్‌ను విమర్శలపాలు చేస్తోంది. భార్య సోఫాలో నిద్రపోతోంటే మెల్లగా వచ్చి ఆమె ముఖంపై దిండు అదిమిపడతాడు. అయితే, అతడు దిండు అదిమిపట్టిన చోట ఆమె కాళ్లు ఉంటాయి. అటువైపు ముఖం ఉంటుంది. భార్య లేచిచూసేవరకు అతడికి ఆ విషయం తెలియదు. దాంతో చేతిలో ఉన్న దిండును ఆమె మెడ కింద ఉంచి, నుదిటిపై ముద్దాడి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇది ఆ వీడియోలో ఉంది. ఇదే ఇప్పుడు షావీర్‌ను నెటిజన్ల ఆగ్రహానికి గురి చేసింది.

Viral Video: రైల్లో ఓ వృద్ధ జంట ప్రయాణం.. భర్త చేసిన పనిని దూరం నుంచి సీక్రెట్‌గా వీడియో తీశాడో ప్రయాణీకుడు.. నెట్టింట పోస్ట్ చేస్తే..

గృహ హింస (Domestic Violence) కారణంగా పాకిస్థాన్‌లో ప్రతియేటా వేలాది మంది చనిపోతుంటే.. అదే గృహహింసపై నీవు కామెడీ చేస్తావా? అంటూ ఈ వీడియో చూసిన నెటిజన్లు మనోడిని ఉతికి ఆరేస్తున్నారు. తమదైనశైలిలో ఘాటు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. "టిక్‌టాకర్ షావీర్ జాఫ్రీ చేసిన ఈ వీడియోకు ఏకంగా 41.3 లైక్స్ వచ్చాయి. భార్యను దిండుతో అదిమిపట్టి ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేసి చంపాలనుకోవడం అతడి దృష్టిలో జోక్. ఏ డొమెస్టిక్ వయోలెన్స్ ద్వారానైతే పాక్‌లో ప్రతి ఏడాది వేలాది మంది మహిళలు చనిపోతున్నారో దాన్నే మనోడు జోక్ అంటున్నాడు. భర్తల చేతిలో భార్యలు చనిపోవడం మనోడికి పెద్ద జోక్ అన్నమాట. నా రక్తం మరిగిపోతుంది" అంటూ నిషత్ అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను ట్వీట్ చేశారు. మరో ట్విటర్ యూజర్ కన్వాల్ అహ్మద్ ఇదే వీడియోను షేర్ చేస్తూ.. "గృహ హింస కారణంగా ప్రతి సంవత్సరం వేలాది మంది మహిళలు చంపబడుతున్న దేశంలో - ప్రసిద్ధ యూట్యూబర్‌లు మీ భార్యను ఉక్కిరిబిక్కిరి చేయడం తమాషాగా భావిస్తారు" అంటూ మండిపడ్డారు. ఇలా ఈ వీడియో చూసిన ప్రతిఒక్కరూ షావీర్ జాఫ్రీని ఏకి పారేస్తున్నారు.

Viral Video: నీ మాటలు నిజమే బాసూ.. అంటూ ఆటో డ్రైవర్‌కు అనూహ్య మద్ధతు.. ఇంతకీ ఆటో వెనుక అతడు ఏం రాశాడంటే..

Updated Date - 2023-04-20T10:49:06+05:30 IST