Viral Video: పాపం.. ఈ పిల్లాడు ఎంత ఫీలయ్యాడో.. టీచర్స్ డే కదా అని మస్తు సెలబ్రేషన్స్ చేస్తోంటే.. తరగతి గదిలోనే..!

ABN , First Publish Date - 2023-09-06T10:08:49+05:30 IST

అందరూ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలో మునిగిపోయి ఉంటే ఉపాధ్యాయుడు మాత్రం ఊహించని విధంగా తరగతిలోనే చేసిన పనికి..

Viral Video: పాపం.. ఈ పిల్లాడు ఎంత ఫీలయ్యాడో.. టీచర్స్ డే కదా అని మస్తు సెలబ్రేషన్స్ చేస్తోంటే.. తరగతి గదిలోనే..!

విద్యార్థులలో జ్ఞానజ్యోతిని వెలిగించేవారు ఉపాధ్యాయులు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు. విద్యార్థులు తమ ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు చెబుతారు, మరికొందరు ఎంతో సంబరంగా వేడుక ఏర్పాటు చేస్తారు. ఒక స్కూల్లో కూడా విద్యార్థులందరూ తమ ఉపాధ్యాయులను గౌరవించేందుకు వేడుక ఏర్పాటు చేశారు. వేడుకలో భాగంగా పిల్లలు అందరూ ఎంతో సందడి చేస్తున్నారు. అప్పుడే ఎవరూ ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఆ తరగతిలో ఓ ఉపాధ్యాయుడు చేసిన పనికి అందరూ షాకయ్యారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా షాకవుతున్నారు. ఈ వీడియో గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

తమకు చదువు చెప్పి ఎన్నో విషయాలు నేర్పే గురువు(Teacher) పట్ల విద్యార్థులకు(Students) చెప్పలేనంత భయం ఉంటుంది. కానీ ఆ భయాన్ని పక్కకు పెట్టి ఉపాధ్యాయ దినోత్సవం రోజున టీచర్ల మీద తమకు ఎంత గౌవరం, ప్రేమ, అభిమానం ఉన్నాయో వేడుకల రూపంలో తెలియజేస్తుంటారు. వీడియోలో తరగతిలో ఉపాధ్యాయ దినోత్సవ సెలబ్రేషన్స్(Teacher's Day celebrations) జరుగుతుండటం చూడొచ్చు. ఆ సందడిలో భాగంగా ఓ పిల్లాడు స్నో స్పే(snow spray)ను ఆ గది మొత్తం స్పే చేస్తున్నాడు. అతను నేరుగా తమ ఉపాధ్యాయుడు ఉన్న చోటుకు వెళ్ళి సరదాగా ఉపాధ్యాయుడి ముఖం మీద స్నో స్పే ను స్పే చేశాడు. దీంతో ఆ ఉపాధ్యాయుడికి ఒక్కసారిగా కోపం వచ్చింది. ఆయన తన కోపాన్ని ఏ మాత్రం కంట్రోల్ చేసుకోకుండా తన ఎదురుగా ఉన్న కుర్రాడిని కాలర్ పట్టి ముందుకు లాగి వంగబెట్టి వీపు విమానం మోత మోగించాడు. ఇది పాత వీడియోనే అయినా ఉపాధ్యాయ దినోత్సవ సందర్బంగా మళ్లీ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కొందరు పొట్టచెక్కలయ్యేలా నవ్వుతుండగా, మరికొందరు ఆ ఉపాధ్యాయుడిని విమర్శిస్తున్నారు.

Coconut For Weight Loss: కొబ్బరికాయలతో బరువు ఎలా తగ్గుతారని అనుమానమా..? ఈ 6 కారణాలను వింటే..!



ఈ వీడియోను Ghar Ke Kalesh అనే ట్విట్టర్ ఎక్స్(Twitter X) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పంచులు, సెటైర్లతో కామెంట్స్ చేస్తున్నారు. 'ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఉపాధ్యాయుడి ఆశీర్వాదం లభించింది' అని ఒకరు పంచ్ వేశారు. 'అంత సెలబ్రేషన్ చూసి ఉపాధ్యాయుడు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు' అని మరొకరు సెటైర్ వేశారు. ' విద్యార్థులు ప్రేమగా సెలబ్రేషన్ చేస్తోంటే ఉపాధ్యాయులు ఇలా ప్రవర్తించడం బాలేదు' అని మరికొందరు అంటున్నారు.

Accident Video: కుక్కను కాపాడాలని బ్రేక్ వేసింది కానీ.. మరుక్షణంలోనే షాకింగ్ సీన్.. కారుపై ఏదో పడ్డట్టు అనిపించి బయటకు వచ్చి చూస్తే..!


Updated Date - 2023-09-06T10:08:49+05:30 IST