Share News

Social Media: దారుణం.. టీమిండియా ఆటగాళ్లను అవమానించిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు

ABN , First Publish Date - 2023-11-25T17:08:23+05:30 IST

Team india: ఆస్ట్రేలియా మీడియా సంస్థకు చెందిన సోషల్ మీడియాలో టీమిండియాను అవమానపరుస్తూ ఓ ఫోటో పోస్ట్ చేసింది. South Australia Man Gives Birth To World Record 11 Sons అంటూ ఆ పోస్టుకు క్యాప్షన్ పెట్టింది. ఈ ఫోటోలో ప్రపంచకప్ ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ట్రావిస్ హెడ్‌ను డెలవరీ రూంలో బెడ్‌పై పడుకున్న తల్లిగా చూపిస్తూ పిల్లలకు టీమిండియా క్రికెటర్ల ఫోటోలను మార్ఫింగ్ చేయడం వివాదానికి దారి తీసింది.

Social Media: దారుణం.. టీమిండియా ఆటగాళ్లను అవమానించిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు

వన్డే ప్రపంచకప్ ఫైనల్లో అద్భుత రాణించిన ఆస్ట్రేలియా ఆ తర్వాత తన వ్యవహారశైలితో వార్తల్లో నిలుస్తోంది. దీంతో పలు వివాదాల్లో ఆస్ట్రేలియా క్రికెటర్లు కేంద్రబిందువుగా మారుతున్నారు. ప్రపంచకప్ ట్రోఫీపై కాళ్లు పెట్టి మద్యం సేవిస్తున్న మిచెల్ మార్ష్ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది. మిచెల్ మార్ష్ చేసిన పనిని టీమిండియా అభిమానులు ముక్తకంఠంతో ఖండించారు. తాజాగా ఆస్ట్రేలియా మీడియా సంస్థకు చెందిన సోషల్ మీడియాలో టీమిండియాను అవమానపరుస్తూ ఓ ఫోటో పోస్ట్ చేసింది. South Australia Man Gives Birth To World Record 11 Sons అంటూ ఆ పోస్టుకు క్యాప్షన్ పెట్టింది. ఈ ఫోటోలో ప్రపంచకప్ ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ట్రావిస్ హెడ్‌ను డెలవరీ రూంలో బెడ్‌పై పడుకున్న తల్లిగా చూపిస్తూ పిల్లలకు టీమిండియా క్రికెటర్ల ఫోటోలను మార్ఫింగ్ చేయడం వివాదానికి దారి తీసింది.

కాగా ఆస్ట్రేలియా క్రికెటర్లు ప్యాట్ కమిన్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ ఫోటోకు లైక్ కొట్టడం పుండు మీద కారం చల్లినట్లు అయ్యింది. దీంతో ఆస్ట్రేలియా క్రికెటర్లు చేసిన పని పట్ల టీమిండియా అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మైదానంలో ఆడటం గొప్ప కాదని.. బయట కూడా ప్రొఫెషనల్‌గా వ్యవహరించడం చాలా ముఖ్యమని హితవు పలుకుతున్నారు. ఇదే తరహాలో టీమిండియా అభిమానులు మార్ఫింగ్ ఫోటోలు చేస్తే మీరు ఊరుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. తక్షణమే ఆస్ట్రేలియా టీమ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఐపీఎల్ ఆడుతున్న సమయంలో ప్రతీకారం తీర్చుకుంటామని కొందరు అభిమానులు ఛాలెంజ్ చేస్తున్నారు. ఇలాంటి పోస్టులకు లైక్ కొట్టే క్రికెటర్లను ఐపీఎల్‌లో ఆడకుండా నిషేధం విధించాలని కోరుతున్నారు. మొత్తంగా టీమిండియా క్రికెటర్లను అవమానిస్తూ ఆస్ట్రేలియా మీడియా ఈ తరహా పోస్టులు పెట్టడం టీమిండియా అభిమానులకు మింగుడుపడటం లేదు.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-25T17:57:36+05:30 IST