Share News

Australia Team: నంబర్‌వన్ ర్యాంకులు నిల్.. కానీ ఒక్క ఏడాదిలో రెండు ఐసీసీ కప్పులు

ABN , First Publish Date - 2023-11-24T22:05:28+05:30 IST

ఈ ఏడాది ఆస్ట్రేలియా అందరినీ ఆశ్చర్యపరుస్తూ రెండు ఐసీసీ ట్రోఫీలను సాధించింది. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్‌తో పాటు వన్డే ప్రపంచకప్ ట్రోఫీలను ఆస్ట్రేలియా తన ఖాతాలో వేసుకుంది. అయితే ఐసీసీ ర్యాంకుల్లో ఆస్ట్రేలియాకు చెందిన ఆటగాళ్లు నంబర్‌వన్ పొజిషన్‌లో ఒకరు కూడా లేరు. దీంతో నంబర్‌వన్ ర్యాంకులు లేకుండా నంబర్‌వన్‌గా నిలిచిన ఆస్ట్రేలియాను అందరూ ప్రశంసిస్తున్నారు.

Australia Team: నంబర్‌వన్ ర్యాంకులు నిల్.. కానీ ఒక్క ఏడాదిలో రెండు ఐసీసీ కప్పులు

వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియాకు ఘనమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు ఆరుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. అయితే ఐసీసీ ర్యాంకుల్లో ఆస్ట్రేలియాకు చెందిన ఆటగాళ్లు నంబర్‌వన్ పొజిషన్‌లో ఒకరు కూడా లేరు. కానీ ఈ ఏడాది ఆస్ట్రేలియా అందరినీ ఆశ్చర్యపరుస్తూ రెండు ఐసీసీ ట్రోఫీలను సాధించింది. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్‌తో పాటు వన్డే ప్రపంచకప్ ట్రోఫీలను ఆస్ట్రేలియా తన ఖాతాలో వేసుకుంది. దీంతో నంబర్‌వన్ ర్యాంకులు లేకుండా నంబర్‌వన్‌గా నిలిచిన ఆస్ట్రేలియాను అందరూ ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఐసీసీ ర్యాంకులను చూసుకుంటే టీమ్ ర్యాంకుల్లో అన్ని ఫార్మాట్లలో టీమిండియానే అగ్రస్థానంలో ఉంది. వన్డేలు, టెస్టులు, టీ20ల్లో భారత్ నంబర్‌వన్‌గా కొనసాగుతోంది. ఆస్ట్రేలియా మాత్రం టెస్టుల్లో రెండో ర్యాంకులో, వన్డేల్లో రెండో ర్యాంకులో, టీ20ల్లో నాలుగో ర్యాంకులో ఉంది.

అటు బ్యాటింగ్ ర్యాంకుల్లో టెస్టుల్లో కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్), వన్డేల్లో శుభ్‌మన్ గిల్ (భారత్), టీ20ల్లో సూర్యకుమార్ (భారత్) నంబర్‌వన్‌గా ఉన్నారు. బౌలింగ్ ర్యాంకుల్లో టెస్టుల్లో అశ్విన్ (భారత్), వన్డేల్లో కేశవ్ మహరాజ్ (దక్షిణాఫ్రికా), టీ20ల్లో రషీద్ ఖాన్ (ఆప్ఘనిస్తాన్) అగ్రస్థానంలో ఉన్నారు. ఆల్‌రౌండర్ల ర్యాంకుల్లో టెస్టుల్లో రవీంద్ర జడేజా (భారత్), వన్డేల్లో షకీబుల్ హసన్ (బంగ్లాదేశ్), టీ20ల్లో షకీబుల్ హసన్ (బంగ్లాదేశ్) నంబర్‌వన్ ర్యాంకులో ఉన్నారు .


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-24T22:05:29+05:30 IST