Share News

Shubman Gill: సారాతో మళ్లీ చిగురించిన ప్రేమాయణం.. ఇవే సాక్ష్యాలు..!!

ABN , First Publish Date - 2023-10-20T15:51:10+05:30 IST

పూణె వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌కు సారా టెండూల్కర్ తన స్నేహితులతో కలిసి హాజరైంది. ఫీల్డింగ్ సమయంలో శుభ్‌మన్ గిల్ క్యాచ్ పట్టగా సారా టెండూల్కర్ ఎగిరి గంతేసింది. బ్యాటింగ్‌లోనూ శుభ్‌మన్ గిల్ రెండు సిక్సర్లు బాదగా.. ఈ రెండు సందర్భాల్లోనూ సారా టెండూల్కర్ చప్పట్లతో అతడిని అభినందించింది.

Shubman Gill: సారాతో మళ్లీ చిగురించిన ప్రేమాయణం.. ఇవే సాక్ష్యాలు..!!

టీమిండియా యువ సంచలనం శుభ్‌మన్ గిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓపెనర్‌గా ప్రస్తుతం గిల్ అదరగొడుతున్నాడు. ఈ ఏడాది అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. వన్డే ప్రపంచకప్‌లోనూ రోహిత్ శర్మతో పాటు గిల్ కూడా టీమిండియాకు ఎంతో కీలక ఆటగాడు. డెంగ్యూ జ్వరం బారిన పడి తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన గిల్ పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు. అయితే ఆ మ్యాచ్‌లో త్వరగా అవుటైనా.. గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ మ్యాచ్‌లో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి. ఫీల్డింగ్, బ్యాటింగ్ సమయంలో గిల్ రాణించిన ప్రతీసారి స్టేడియంలో ఓ యువతి అతడిని ప్రోత్సహిస్తూ కేరింతలు కొట్టింది. ఆ అమ్మాయి ఎవరో కాదు గిల్ మాజీ ప్రేయసి, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్. పూణె వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌కు సారా టెండూల్కర్ తన స్నేహితులతో కలిసి హాజరైంది. స్టాండ్స్‌ నుంచి సారా టెండూల్కర్ ఈ మ్యాచ్‌ను ఆస్వాదిస్తూ టీమిండియాకు మద్దతు తెలిపింది.

ఇది కూడా చదవండి: ODI World Cup: టీమిండియాకు ఎదురుదెబ్బ.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు పాండ్యా దూరం

గతంలో గిల్-సారా ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో అవ్వడం.. తమ ఫొటోలకు కామెంట్ చేసుకోవడంతో ఈ ఇద్దరి ప్రేమయాణానికి సంబంధించిన వార్తలకు బలం చేకూరింది. అయితే కొంతకాలం తర్వాత వీళ్లిద్దరికి బ్రేకప్ అయిందని పుకార్లు వినిపించాయి. కానీ గురువారం నాటి మ్యాచ్ చూస్తే వీళ్లిద్దరి మధ్య మరోసారి ప్రేమ చిగురించిందని తెలుస్తోందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఫీల్డింగ్ సమయంలో శుభ్‌మన్ గిల్ క్యాచ్ పట్టగా సారా టెండూల్కర్ ఎగిరి గంతేసింది. బ్యాటింగ్‌లోనూ శుభ్‌మన్ గిల్ రెండు సిక్సర్లు బాదగా.. ఈ రెండు సందర్భాల్లోనూ సారా టెండూల్కర్ చప్పట్లతో అతడిని అభినందించింది. ఇవే గిల్-సారా మధ్య ప్రేమ చిగురించిందని చెప్పడానికి సాక్ష్యాలు అని నెటిజన్‌లు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2023-10-20T16:13:59+05:30 IST