Share News

IND Vs AUS: అభిమానులకు బ్యాడ్ న్యూస్.. రెండో టీ20 జరిగేది అనుమానమే..?

ABN , First Publish Date - 2023-11-25T20:03:37+05:30 IST

IND Vs AUS: భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆదివారం రెండో టీ20 జరగనుంది. అయితే కొన్ని రోజులుగా తిరువనంతపురంలో భారీ వర్షం కురుస్తోంది. ఆదివారం కూడా మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆదివారం ఉదయం వర్షం కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ.. మధ్యాహ్నం మాత్రం చిరుజల్లులు కురుస్తాయని తెలిపింది.

IND Vs AUS: అభిమానులకు బ్యాడ్ న్యూస్.. రెండో టీ20 జరిగేది అనుమానమే..?

భారత్-ఆస్ట్రేలియా ఐదు టీ20ల సిరీస్ చప్పగానే ప్రారంభమైంది. వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓడిపోవడంతో అభిమానులు ఇంకా నిరాశలోనే ఉన్నారు. దీంతో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ను పట్టించుకోలేదు. అయితే తొలి టీ20 వాళ్ల మైండ్ సెట్‌ను కొంత మార్చగలిగింది. ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించినా టీమిండియా 3 వికెట్ల తేడాతో విజయం సాధించి అభిమానులకు మజా పంచింది. ఇప్పుడు అభిమానుల దృష్టి తిరువనంతపురం వేదికగా జరిగే రెండో టీ20 మీద పడింది. కానీ ఈ మ్యాచ్ జరిగే అవకాశాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. వర్షం కారణంగా రెండో టీ20 వాష్ అవుట్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. శనివారం తిరువనంతపురంలో భారీ వర్షం పడటంతో గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలోని గ్రౌండ్ చిత్తడిగా మారింది. ఆదివారం కూడా వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ నివేదిక ఇవ్వడంతో ఈ మ్యాచ్ సజావుగా సాగడంపై అనుమానాలు నెలకొన్నాయి.

కాగా కొన్ని రోజులుగా తిరువనంతపురంలో భారీ వర్షం కురుస్తోంది. ఆదివారం కూడా మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆదివారం ఉదయం వర్షం కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ.. మధ్యాహ్నం మాత్రం చిరుజల్లులు కురుస్తాయని తెలిపింది. అయితే సాయంత్రం మేఘాలు తొలిగిపోతాయని.. మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడకపోవచ్చని తెలిపింది. ఒకవేళ భారీ వర్షం పడితే గ్రౌండ్‌ను ఎంత త్వరగా ఆరబెడతారనే దానిపైనే మ్యాచ్ ప్రారంభమయ్యే సమయం ఆధారపడి ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. అటు తిరువనంతపురంలో వర్షం కారణంగా మ్యాచ్‌లకు ఆటంకం కలగడం ఇదేం కొత్త కాదు. వన్డే ప్రపంచకప్ ముందు తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన అన్ని వార్మప్ మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. దీంతో ఒక్క వార్మప్ మ్యాచ్ కూడా ఆడకుండానే టీమిండియా మెగాటోర్నీలో బరిలోకి దిగిందని క్రికెట్ అభిమానులు గుర్తు చేస్తున్నారు.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-25T20:03:38+05:30 IST