Share News

ODI World Cup 2023: కంటతడి పెట్టిన టీమిండియా ప్లేయర్స్.. రోహిత్, విరాట్‌ను ఇలా చూడలేరు!!

ABN , First Publish Date - 2023-11-19T22:37:02+05:30 IST

ODI World Cup 2023 అవును.. అంచనాలన్నీ తలకిందులయ్యాయి..! వరల్డ్ కప్ మనదే అనుకున్న దేశ ప్రజలు ఇండియా ఓడిపోయిందనే విషయాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. మూడోసారి విశ్వవిజేతగా నిలుస్తుందనుకున్న టీమిండియా తుది పోరులో దారుణ ప్రదర్శనతో ఆసిస్‌పై ఓటమిపాలయ్యింది...

ODI World Cup 2023: కంటతడి పెట్టిన టీమిండియా ప్లేయర్స్.. రోహిత్, విరాట్‌ను ఇలా చూడలేరు!!

అవును.. అంచనాలన్నీ తలకిందులయ్యాయి..! వరల్డ్ కప్ మనదే అనుకున్న దేశ ప్రజలు ఇండియా ఓడిపోయిందనే విషయాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. మూడోసారి విశ్వవిజేతగా నిలుస్తుందనుకున్న టీమిండియా తుది పోరులో దారుణ ప్రదర్శనతో ఆసిస్‌పై ఓటమిపాలయ్యింది. తొలుత బ్యాటింగ్ చేసి కేవలం 240 పరుగులు స్కోరు చేసిన భారత్.. ఆ తర్వాత ప్రత్యర్థి ఆస్ట్రేలియా వికెట్లు తీయలేక చతికిలపడింది. 47 పరుగులకే మూడు వికెట్లు తీసినా.. ఆ తర్వాత వికెట్ తీయలేక చివరకు ఓటమి పాలైంది. దీంతో 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించి ఆరోసారి వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిచింది. ఈ ఓటమితో క్రికెట్ వీరాభిమానులు, క్రీడా ప్రియులే కాదు.. టీమిండియా ఆటగాళ్లు కూడా కనీళ్లు పెట్టుకున్నారు.


Rohit-2.jpg

ఏడ్చేశారు!

ఈ ఓటమితో స్టేడియంలో ఉన్న భారత్ ప్రేక్షకులు తీవ్ర భావోద్వేగానికి లోనై వెనుదిరిగారు. సిరాజ్, రాహుల్ తీవ్ర భావోద్వేగానికి గురవ్వడంతో సహచర ఆటగాళ్లు ఓదార్చారు. అయితే కంట్రోల్ కాకపోవడంతో విరాట్, రోహిత్ శర్మ కూడా ఏడ్చేశారు. టీమిండియా ప్లేయర్లు కన్నీటి పర్యంతం అయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ అయితే అస్సలు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. తలకూడా పైకెత్తకుండా కనీళ్లు తుడుచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై క్రీడాభిమానులు, క్రికెట్ లవర్స్ చిత్రవిచిత్రాలుగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘ఇలా చూడలేం దయచేసి ఏడవకండి’ అని ట్విట్టర్ వేదికగా కొందరు రోహిత్‌ను ఓదారుస్తుండగా.. ఇంకొందరేమో ‘చేయాల్సిదంతా చేసి ఇక ఏడుపెందుకు బ్రో..’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో నెటిజన్లను కట్టిపడేస్తోంది.

Rohit.jpg

కూల్.. కూల్!!

అంతా విధి రాత ఏం చేయగలవు రోహిత్.. విరాట్.. కూల్ కూల్‌అని చెబుతున్నారు. మరికొందరైతే గెలుపైనా.. ‘ఓటమైనా మీది మాత్రమే కాదు మీ వెనకున్న 140 కోట్ల మందిది.. గెలిస్తే అభినందిస్తాం.. ఓడితే భుజం తట్టి ప్రోత్సహిస్తాం.. ఫలితంతో సంబంధం లేకుండా ఎప్పటికీ మీ వెంటే ఉంటాం’ అని టీమిండియా వీరాభిమానులు ధైర్యం చెబుతున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకూ తొమ్మిది నాకౌట్ మ్యాచుల్లో టీమిండియా ఓటమి చెందడం భారత అభిమానులను కలిచివేస్తోంది.

Updated Date - 2023-11-19T22:42:28+05:30 IST