IPL Auction 2024: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సెంచరీ హీరో ట్రావిస్ హెడ్‌ను దక్కించుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్
ABN , Publish Date - Dec 19 , 2023 | 02:03 PM
భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌పై సెంచరీతో చెలరేగిన ఆసీస్ ఆటగాడు ట్రావిస్ హెడ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. ఏకంగా రూ.6.80 కోట్ల మొత్తాన్ని వెచ్చించి అతడిని సొంతం చేసుకుంది.
దుబాయ్: భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌పై సెంచరీతో చెలరేగిన ఆసీస్ ఆటగాడు ట్రావిస్ హెడ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. ఏకంగా రూ.6.80 కోట్ల మొత్తాన్ని వెచ్చించి అతడిని సొంతం చేసుకుంది. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయంలో ట్రావిస్ హెడ్ కీలక పాత్ర పోషించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో కూడా రాణించాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లో అతడు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులను దక్కించుకున్నాడు.
ఇక టీ20లలో ట్రావిస్ హెడ్ స్ట్రైక్ రేటు 146.17 శాతంగా ఉంది. ఇటీవల భారత్ వేదికగా జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడాడు. 18 బంతుల్లో 35 పరుగులు, 16 బంతుల్లో 31, 18 బంతుల్లో 28 చొప్పున పరుగులు కొట్టాడు. ఇక 2016, 2017 సీజన్లలో ట్రావిస్ హెడ్ విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు. ఐపీఎల్లో అతడు పెద్దగా రాణించలేదు. 2 సీజన్లలో 10 మ్యాచ్‌లలో కలిపి 205 పరుగులు మాత్రమే సాధించాడు.