Share News

India Vs Newzealand: భారత బ్యాటర్ల విధ్వంసం.. కివీస్ ముందు కొండంత లక్ష్యం

ABN , First Publish Date - 2023-11-15T18:28:42+05:30 IST

వరల్డ్ కప్ 2023 సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు చెలరేగాయి. న్యూజిలాండ్ బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించారు. కింగ్ విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ సెంచరీలతో అదరగొట్టారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి భారత్ 397 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.

India Vs Newzealand: భారత బ్యాటర్ల విధ్వంసం.. కివీస్ ముందు కొండంత లక్ష్యం

ముంబై: వరల్డ్ కప్ 2023 సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు చెలరేగాయి. న్యూజిలాండ్ బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించారు. కింగ్ విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ సెంచరీలతో అదరగొట్టారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి భారత్ 397 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ప్రత్యర్థి కివీస్‌కు 398 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కివీస్ బౌలర్లు ఏ దశలోనూ భారత బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్ మరోసారి అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. జట్టు స్కోరు 71 పరుగుల వద్ద రోహిత్ శర్మ ఔటయ్యాడు. ఆ తర్వాత విరాట్‌తో కలిసి గిల్ కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే వ్యక్తిగత స్కోరు 80 పరుగుల వద్ద కాలి కండరాలు పట్టేయడంతో అనూహ్యంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుతిరగాల్సి వచ్చింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ వరుసగా రెండవ శతకాన్ని నమోదు చేశాడు. కేవలం 70 బంతుల్లోనే 105 పరుగులు కొట్టి ఔటయ్యాడు. అయ్యర్ ఇన్నింగ్స్‌లో 8 సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి. ఇక కింగ్ విరాట్ కోహ్లీ 113 బంతులు ఎదుర్కొని 117 పరుగులు సాధించాడు. దీంతో వన్డే కెరీర్‌లో 50 సెంచరీలు సాధించిన మొట్టమొదటి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. చివరిలో కేఎల్ రాహుల్ కూడా మెరుపులు మెరిపించారు.

స్కోర్ బోర్డ్...

రోహిత్ శర్మ (47), శుభ్‌మాన్ గిల్ (80 రిటైర్డ్ హర్ట్), విరాట్ కోహ్లీ (117), శ్రేయాస్ అయ్యర్ (105), కేఎల్ రాహుల్ (39 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్(1) చొప్పున పరుగులు చేశాడు.

తేలిపోయిన న్యూజిలాండ్ బౌలింగ్..

కీలకమైన సెమీస్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బౌలర్లు తేలిపోయారు. వికెట్లు తీయలేకపోవడాన్ని పక్కన పడితే కనీసం పరుగులను కూడా నియంత్రించలేకపోయారు. భారత బ్యాటర్లు సిక్సులు, ఫోర్లు కొడుతుంటే ఆపలేకపోయారు. 10 ఓవర్లలో 100 పరుగులు సమర్పించుకున్న సౌథీకి 3 వికెట్లు, బౌల్ట్‌కి 1 వికెట్ మాత్రమే పడ్డాయి.

Updated Date - 2023-11-15T18:31:40+05:30 IST