Thala Dhoni: ఖుష్బూ అత్తయ్యను సర్‌ప్రైజ్ చేసిన ధోనీ.. నెటిజన్లు ఫిదా!

ABN , First Publish Date - 2023-04-14T19:01:30+05:30 IST

టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్(CSK) కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ(MS Dhoni)కి ఉన్న ఫ్యాన్

Thala Dhoni: ఖుష్బూ అత్తయ్యను సర్‌ప్రైజ్ చేసిన ధోనీ.. నెటిజన్లు ఫిదా!

చెన్నై: టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్(CSK) కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ(MS Dhoni)కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వయసుతో సంబంధం లేకుండా ఆయనను అభిమానిస్తారు. ‘మిస్టర్ కూల్’గా పేరుకెక్కిన ధోనీ బ్యాట్, గ్లోవ్స్‌తో మైదానంలో అద్భుతాలు చేస్తుంటాడు. అందుకే అతడిని ‘తాలా’(Thala) అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు.

dhoni.jpg2.jpg

ధోనీ తాజాగా ప్రముఖ సినీ నటి, బీజేపీ నేత ఖుష్బూ(Khushbu Sundar) అత్తయ్యను కలిసి ఆమెను సర్‌ప్రైజ్ చేశాడు. తాను ఎంతగానో అభిమానించే ధోనీని చూడగానే 88 ఏళ్ల వయసున్న ఖుష్బూ అత్తయ్య సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ధోనీ ఆమెతో కలిసి ఫొటలు దిగాడు. తనను సర్‌ప్రైజ్ చేసిన ధోనీని ఖుష్బూ అత్తయ్య ఆప్యాయంగా ముద్దాడారు.

dhoni1.jpg

ఇందుకు సంబంధించిన ఫొటోలను ఖుష్బూ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. హీరోలు తయారుకారని, వారు పుడతారని, ధోనీ ఆ విషయాన్ని నిరూపించాడని ఈ సందర్భంగా ఖుష్బూ రాసుకొచ్చారు. ధోనీ ప్రేమ, ఆతిథ్యానికి తనకు మాటలు రావడం లేదన్నారు. ధోనీని తన అత్తగారు ఎంతగానో ఆరాధిస్తుంటారని, ఆమెను ధోనీ కలిశారని పేర్కొన్నారు. మహీ ఆమెను కలవడం ద్వారా ఆమె ఆయుష్షును, సంతోషాన్ని మరింత పెంచాడని పేర్కొన్నారు. ధోనీకి తన ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్టు పేర్కొన్నారు. దీనిని నిజం చేసిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఓ విజిల్ వేసుకోవాలని పేర్కొన్నారు.

చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా నాలుగు ట్రోఫీలు అందించి తమిళ అభిమానుల మన్ననలు అందుకున్న ధోనీ సినీ రంగంలోనూ కాలుమోపాడు. ‘లెట్స్ గెట్ మ్యారీడ్’(Lets Get Married) అనే సినిమాను భార్య సాక్షితో కలిసి నిర్మిస్తున్నాడు. ఇందులో నదియా, హరీశ్ కల్యాన్, ఇవానా నటిస్తున్నారు. రమేశ్ తమిళమణి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

Updated Date - 2023-04-14T19:29:23+05:30 IST