Share News

IPL Auction: చెన్నైకు ఆడబోతున్న ముస్తాఫిజుర్‌.. ధోనీతో వివాదానికి సంబంధించిన వీడియో వైరల్!

ABN , Publish Date - Dec 20 , 2023 | 05:49 PM

ఐపీఎల్ 2024కు సంబంధించిన మినీ వేలం దుబాయ్‌లో మంగళవారం అట్టహాసంగా జరిగింది. ఈ వేలంలో పాల్గొన్న ఫ్రాంచైజీలు పలువురు ఆటగాళ్లను దక్కించుకున్నాయి. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 2 కోట్లకు దక్కించుకుంది.

IPL Auction: చెన్నైకు ఆడబోతున్న ముస్తాఫిజుర్‌.. ధోనీతో వివాదానికి సంబంధించిన వీడియో వైరల్!

ఐపీఎల్ 2024కు (IPL 2024) సంబంధించిన మినీ వేలం (IPL Auction) దుబాయ్‌లో మంగళవారం అట్టహాసంగా జరిగింది. ఈ వేలంలో పాల్గొన్న ఫ్రాంచైజీలు పలువురు ఆటగాళ్లను దక్కించుకున్నాయి. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను (Mustafizur Rahman) చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రూ. 2 కోట్లకు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో రాబోయే సీజన్‌లో ఎమ్‌ఎస్ ధోనీ (MS Dhoni) సారథ్యంలో ముస్తాఫిజుర్ ఆడబోతున్నాడు. తమ దేశాల తరఫున సుదీర్ఘంగా అంతర్జాతీయ టోర్నీలు ఆడిన ధోనీ, ముస్తాఫిజుర్ మధ్య చిన్న వివాదం చోటు చేసుకుంది.

2015లో ఇండియా, బంగ్లాదేశ్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో ధోనీ, ముస్తాఫిజుర్ మధ్య వివాదం తలెత్తింది. ఆ మ్యాచ్‌లో సింగిల్ తీయడానికి ధోనీ ప్రయత్నిస్తున్న సమయంలో బౌలర్ ముస్తాఫిజుర్ అనుకోకుండా అడ్డు వచ్చాడు. దీంతో ధోనీ అతడిని పక్కకు తోసేశాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య కాస్త వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మ్యాచ్ రిఫరీ ఆ ఇద్దరి మ్యాచ్ ఫీజుల్లో కోత విధించాడు. ఆ ఇద్దరూ ఈ సీజన్ ఐపీఎల్‌లో ఒకే టీమ్ తరఫున ఆడబోతున్నారు.

ఈ నేపథ్యంలో అప్పటి వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ షేర్ చేసింది. ``ఘర్షణ నుంచి కలిసి ఆడేవరకు`` అని ఆ వీడియోకు కామెంట్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై క్రికెట్ ఫ్యాన్స్ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - Dec 20 , 2023 | 05:49 PM