IND vs WI 3rd T20: టీమిండియా ఆటగాళ్లను ఊరిస్తున్న 7 రికార్డులు.. అవేంటో తెలుసా?

ABN , First Publish Date - 2023-08-08T17:01:07+05:30 IST

భారత్, వెస్టిండీస్ మధ్య మంగళవారం మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచి 2-0తో అధిక్యంలో ఉన్న విండీస్ మూడో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు భారత జట్టుకు మాత్రం ఈ మ్యాచ్ డూ ఆర్ డైగా మారింది.

IND vs WI 3rd T20: టీమిండియా ఆటగాళ్లను ఊరిస్తున్న 7 రికార్డులు.. అవేంటో తెలుసా?

గయానా: భారత్, వెస్టిండీస్ మధ్య మంగళవారం మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచి 2-0తో అధిక్యంలో ఉన్న విండీస్ మూడో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు భారత జట్టుకు మాత్రం ఈ మ్యాచ్ డూ ఆర్ డైగా మారింది. సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే ఈ మ్యాచ్‌లో టీమిండియాకు గెలుపు తప్పనిసరి. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియాలోని ఆరుగురు ఆటగాళ్లు ఏడు రికార్డులను చేరుకునే అవకాశాలున్నాయి. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం.

3- మిస్టర్ 360 డిగ్రీస్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మరో 3 సిక్సులు కొడితే అంతర్జాతీయ టీ20ల్లో 100 సిక్సులను పూర్తి చేసుకుంటాడు.

2- కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరొక 2 వికెట్లు తీస్తే టీ20ల్లో విదేశాల్లో 50 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలుస్తాడు.

3- చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మరొక 3 వికెట్లు తీస్తే అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 50 వికెట్లను పూర్తి చేసుకుంటాడు.

5- లెగ్ స్పిన్నర్ యజుర్వేంద్ర చాహల్ మరొక 5 వికెట్లు తీస్తే పొట్టి క్రికెట్‌లో 100 వికెట్లను పూర్తి చేసుకుంటాడు. అలాగే ఈ మ్యాచ్‌తో చాహల్ అంతర్జాతీయ క్రికెట్‌లో 150 మ్యాచ్‌లను పూర్తి చేసుకుంటాడు. కాగా చాహల్ ఇప్పటివరకు వన్డేల్లో 77, టీ20ల్లో 72 మ్యాచ్‌లు ఆడాడు.

2- సంజూ శాంసన్ మరో 2 పరుగులు చేస్తే అన్ని రకాల టీ20 క్రికెట్‌లో 6 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు.

6- పేస్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ మరో 6 వికెట్లు తీస్తే టీ20ల్లో 50 వికెట్లను పూర్తి చేసుకుంటాడు.

అలాగే వెస్టిండీస్ ఆటగాళ్లు నికోలస్ పూరన్, బ్రాండన్ కింగ్, జాన్సన్ చార్లెస్ కూడా పలు రికార్డులకు చేరువలో ఉన్నారు.

7- విండీస్ స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ మరొక 7 సిక్సులు బాదితే టీ20ల్లో 100 సిక్సులను పూర్తి చేసుకుంటాడు.

4- బ్రాండన్ కింగ్ మరొక 4 ఫోర్లు బాదితో టీ20ల్లో 100 ఫోర్లు పూర్తి చేసుకుంటాడు.

24- జాన్సన్ చార్లెస్ మరొక 24 పరుగులు చేస్తే టీ20ల్లో 1,000 పరుగులు పూర్తి చేసుకుంటాడు.

Updated Date - 2023-08-08T17:07:06+05:30 IST