Viral Video: చెల్లిని అత్తారింటికి పంపుతూ బోరున విలపించిన ఆర్సీబీ స్టార్ క్రికెటర్.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు!

ABN , First Publish Date - 2023-08-26T21:44:26+05:30 IST

మానవ సంబంధాలు ఎన్ని ఉన్నా అన్నాచెలెళ్ల బంధం ఎంతో ప్రత్యేకం. అన్నాచెలెళ్ల బంధం గొప్పతనాన్ని చెబుతూ అనేక సినిమాలు సైతం వచ్చాయి. చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా పెంచిన చెల్లిని పెళ్లి చేసి అత్తారింటికి పంపుతుంటే అన్నయ్య బాధ వర్ణనాతీతం.

Viral Video: చెల్లిని అత్తారింటికి పంపుతూ బోరున విలపించిన ఆర్సీబీ స్టార్ క్రికెటర్.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు!

మానవ సంబంధాలు ఎన్ని ఉన్నా అన్నాచెలెళ్ల బంధం ఎంతో ప్రత్యేకం. అన్నాచెలెళ్ల బంధం గొప్పతనాన్ని చెబుతూ అనేక సినిమాలు సైతం వచ్చాయి. చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా పెంచిన చెల్లిని పెళ్లి చేసి అత్తారింటికి పంపుతుంటే అన్నయ్య బాధ వర్ణనాతీతం. చెల్లికి పెళ్లి చేశాననే ఆనందం ఒక వైపు.. తన చెల్లి ఇక నుంచి తనతో ఉండదనే బాధ మరొక వైపు. ఈ రెండింటి మధ్య తీవ్ర భావోద్వేగానికి గురై పసి పిల్లాడిలా బోరున విలపిస్తుంటాడు అన్నయ్య. ఇక నుంచి తన అన్నయ్యతో ఉండననే బాధతో ఆ చెల్లి కళ్లలో నుంచి వచ్చే కన్నీళ్లకు అడ్డుకట్టే ఉండదు. ఈ ఘటన సాధారణ వ్యక్తుల ఇళ్లలోనే కాదు. ధనికులు, సెలబ్రెటీల ఇళ్లలోనూ కనిపిస్తుంటుంది. ఎందుకంటే అన్నా చెలెళ్ల బంధానికి అంతస్థులతో పని లేదు. ఇలాంటి ఘటనే ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది కూడా ఆర్సీబీ, శ్రీలంక స్టార్ క్రికెటర్ కావడం గమనార్హం.


స్టార్ క్రికెటర్ వనిందు హసరంగ తన చెల్లికి పెళ్లి చేసి అత్తారింటికి పంపుతూ బోరున విలపించాడు. చిన్న పిల్లల మాదిరిగా అన్నా చెల్లెళ్లు ఒకరినొకరు పట్టుకోని ఏడుస్తుంటే వారిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. అంతేకాకుండా అంతటి బాధలోనూ బావను(చెల్లెల్లి భర్త) దగ్గరకు తీసుకుని చెల్లిని జాగ్రత్తగా చూసుకోమని చెబుతూ హసరంగ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన పలువురు కూడా కన్నీటిని ఆపులేకపోతున్నారు. స్పిన్ మాయ జాలంతో మైదానంలో బ్యాటర్లను బోల్తా కొట్టించే హసరంగ ఇలా ఏడవడాన్ని చూసి అభిమానులు కూడా తీవ్ర భావోద్వేగంతో కామెంట్లు పెడుతున్నారు. కాగా శ్రీలంకకు చెందిన హసరంగ ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం తొడ కండరాల గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉంటున్న హసరంగ త్వరలో ప్రారంభంకాబోయే ఆసియా కప్ లీగ్ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. స్టార్ ఆల్‌రౌండరైన హసరంగ లేకపోవడం శ్రీలంకకు పెద్ద దెబ్బగానే చెప్పుకోవాలి.

Updated Date - 2023-08-26T21:44:26+05:30 IST