Share News

Pocharam Srinivasreddy: ఆనవాయితీగా వస్తున్న పాత అంబాసిడర్ కారులో వెళ్లి నామినేషన్ వేసిన పోచారం

ABN , First Publish Date - 2023-11-04T13:29:51+05:30 IST

బాన్సువాడలో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.

Pocharam Srinivasreddy: ఆనవాయితీగా వస్తున్న పాత అంబాసిడర్ కారులో వెళ్లి నామినేషన్ వేసిన పోచారం

కామారెడ్డి: బాన్సువాడలో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Speaker Pocharam Srinivas Reddy ) నామినేషన్ దాఖలు చేశారు. 1994 నుంచి ఆనవాయితీగా వస్తున్న తన పాత అంబాసిడర్ కారులోనే పోచారం నామినేషన్ వేశారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ... అభ్యర్థులు హుందా తనంగా ఉండాలని సూచించారు. పనితీరు బాగుండాలని.. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల కోసం పని చేయాలన్నారు. ఇల్లు అలకగానే పండుగ కాదన్నారు. 1994 నుంచి ఇప్పటి వరకూ 8 సార్లు పోటీ చేసి 7 సార్లు గెలిచానని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టో అద్భుతంగా ఉందన్నారు. బీఆర్‌ఎస్‌ది (BRS) ఆమోద యోగ్యమైన, అమలు చేయదగ్గ మేనిఫెస్టో అని తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ హామీలు అమలు కావడం లేదన్నారు. డీకే శివకుమార్ (DK Shivakumar) కర్ణాటకలో ఐదు గంటల కరెంటు ఇస్తామని అంటున్నారని అన్నారు. బీఆర్‌ఎస్‌కు చాలా స్థానాల్లో పోటీయే లేదని సర్వేలు చెబుతున్నాయన్నారు. బీఆర్‌ఎస్ మూడోసారి రావడం, సీఎం కేసీఆర్ (CM KCR) హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని పోచారం శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2023-11-04T13:29:52+05:30 IST